Prakash Raj Accident: తెలుగు సినీ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన దర్శకుడిగా, నిర్మాతగా కూడా చేశాడు. తన నటనకు ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ విలన్, సహాయ పాత్రలలో నటిస్తున్నాడు. ఇటీవలే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈయనకు చిన్న ప్రమాదం జరిగింది.
ఇద్దరూ అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు ప్రకాష్ రాజ్. ఆ తర్వాత హిట్లర్, చిరునవ్వుతో వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం హీరోగానే కాకుండా విలన్ గా కూడా నటించాడు. అంతేకాకుండా హీరో హీరోయిన్స్ కి తండ్రి పాత్రలో, తాత పాత్రలలో కూడా నటించాడు. తమిళంలో కూడా పలు సినిమాలలో నటించి దాదాపు 60కి పైగా సినిమాలలో నటించాడు.
ఇక ప్రస్తుతం పలు సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గానే కనిపిస్తాడు.తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో బాగా పంచుకుంటాడు. ఇక తాజాగా తన ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. తాను కింద పడటంతో తన కాలికి ఫ్యాక్చర్ అయిందని.. సర్జరీ కోసం తన స్నేహితుడు డాక్టర్ గురువా రెడ్డి దగ్గరికి హైదరాబాద్ కు వస్తున్నానని ట్వీట్ చేశాడు.
A small fall.. a tiny fracture.. flying to Hyderabad into the safe hands of my friend Dr Guruvareddy for a surgery. I will be fine nothing to worry .. keep me in your thoughts ??????
— Prakash Raj (@prakashraaj) August 10, 2021
ఇక తన అభిమానులకు తన ఆరోగ్యం పట్ల ఆందోళన చెందవద్దని కోరాడు. ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నట్లు తెలిపాడు. తనకు ప్రమాదం ఎలా జరిగిందో అనే విషయాన్ని చెప్పకపోగా.. ఈ విషయం గురించి టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన అభిమానులు కూడా ఏం జరిగింది అని తెగ ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక ఆయన సినిమాల విషయానికొస్తే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లైగర్ సినిమాలో నటిస్తున్నాడు. అంతేకాకుండా పలు సినిమాలలో అవకాశాలు అందుకున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, MAA Elections, Prakash Raj, Surgery twit, Tollywood, VIRAL NEWS