• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • PRAKASH RAJ HELPED A GIRL FROM GODAVARI DISTRICT TO PURSUE HER DREAM OF HIGHER STUDIES SR

Prakash Raj : ప్రకాష్ రాజ్ పెద్ద మనసు.. చదువుల తల్లికి అండగా..

Prakash Raj : ప్రకాష్ రాజ్ పెద్ద మనసు.. చదువుల తల్లికి అండగా..

సిరి చందనతో ప్రకాష్ రాజ్ Photo : Twitter

Prakash Raj : ప్రకాష్‌రాజ్.. ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర లేదు. తన నటన, ప్రవర్తన, సామాజిక అంశాల పట్ల అవగాహాన ఆయన్ని అందరిలో విభిన్నంగా చూపుతుంది.

  • Share this:
    ప్రకాష్‌రాజ్.. ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర లేదు. తన నటన, ప్రవర్తన, సామాజిక అంశాల పట్ల అవగాహాన ఆయన్ని అందరిలో విభిన్నంగా చూపుతుంది. ప్రకాష్ రాజ్ నచ్చితేనే చేస్తాడు. అంతేకాదు ఎదుటివాళ్లకు సాయం చేయాలనే మంచి హృదయం ఉన్నవాళ్లలో ప్రకాష్‌రాజ్ ఒకరు. ఈ విషయంలో మిగితా నటుల కంటే ముందే ఉంటాడు. అందులో భాగంగా కరోనా కారణంగా ఏర్పడ్డ ఈ లాక్‌డౌన్ కాలంలో కష్టాల్లో ఉన్నవాళ్లకు తన వంతు సాయం చేస్తూ వస్తున్నారు ప్రకాష్. అలా ఎక్కడినుంచో వచ్చిన వలస కార్మికులకు కష్టకాలంలో ఆపన్న హస్తంగా ఉంటూ వారికి కావాల్సిన అవసరాలను తీర్చాడు. అంతేకాదు తన ఫౌండేషన్ తరుపున ఓ గ్రామాన్ని కూడా దత్తత తీసుకున్నాడు. ఈ లక్షణాలు అందరిలో చూడలేము. కొంత మంది నటులు కోట్లకు ఉంటారు. కానీ సాయం చేసే మనస్సు ఉండదు. కానీ ప్రకాష్ తనకు ఉన్నదాంట్లోనే కొందరికి సాయం చేయాలనే మనస్సు ఉంది. దాన్ని ఆయన ఇప్పటికే చాలా సార్లు నిరూపించుకున్నాడు. అలా తాజాగా ఈ జాతీయ ఉత్తమ నటుడు ఓ అమ్మాయి చదువుకు కావాల్సిన డబ్బును సమకూర్చాడు.

    ఓ బ్రిలియంట్ స్టూడెంట్‌కు మాస్టర్స్ డిగ్రీ చేయడానికి అవసరమైన ఆర్థిక సాయాన్ని చేయడానికి ముందుకు వచ్చాడు ప్రకాష్ రాజ్. పశ్చిమ గోదావరికి జిల్లాకు చెందిన సిరిచందన స్కూలు నుంచే అత్యుత్తమ ప్రతిభ కనపరుస్తూ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసింది. తన ప్రతిభకు తగ్గట్లుగా ఆమెకు మాంచెస్టర్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సాల్‌ఫోర్డ్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్‌ డిగ్రీ చేయడానికి సీటు వచ్చింది. తనకు సరస్వతి అనుగ్రహం ఉన్న లక్ష్మి దేవి కటాక్షం లేక అక్కడ చదవడానికి ఆర్థిక పరిస్థితి సహకరించని పక్షంలో.. ఆశలు వదిలేసుకున్న చదువుల తల్లి పాలిట ఆపద్బాంధవుడయ్యాడు ప్రకాష్‌రాజ్‌. దీంతో సిరిచందన ఆనందాన్ని అవధులు లేవు. ఈ నేపథ్యంలో తనకు ఇంత సాయం చేసిన ప్రకాష్ రాజ్’కు కృతజ్ఞతలు తెలియజేయడానికి హైదరాబాద్‌లో షూటింగ్‌లో ఉన్న ఆయన్ను కలిసి ఆశీర్వాదం తీసుకుంది సిరి చందన.

    ఇక ప్రకాష్ రాజ్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం కృష్ణ వంశీ దర్శకత్వంలో వస్తోన్న రంగమార్తండలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. అయితే ప్రకాష్ రాజ్ ఇంతకు మందంతా బీజీగా లేడు. సినిమా అవకాశాలు కూడా తగ్గాయి. అయితే దీనికి కారణం లేకపోలేదు అంటున్నారు ఆయన అభిమానులు. ఇటీవల ప్రకాష్ రాజ్ ప్రభుత్వాన్ని వివిధ అంశాల్లో ప్రశ్నిస్తున్నాడు. ఇది కూడా పరోక్షంగా ఆయనకు అవకాశాలను రాకుండా చేస్తుందేమోనని భావిస్తున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు