ప్రకాష్ రాజ్‌కు కోలీవుడ్ సెగ.. తమిళ సినిమాల్లో బ్యాన్ చేయాలని డిమాండ్..

దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రకాష్ రాజ్. తాజాగా ఈ నటుడు తమిళనాడుకు సంబంధించిన ఓ విషయంలో వ్యతిరేకంగా వ్యవహరించారనేన ఆరోపణలపై  కోలీవుడ్ సినిమాల్లో ప్రకాష్ రాజ్ పై బ్యాన్ విధించాలనే దాకా వెళ్లింది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: May 6, 2019, 5:18 PM IST
ప్రకాష్ రాజ్‌కు కోలీవుడ్ సెగ.. తమిళ సినిమాల్లో బ్యాన్ చేయాలని డిమాండ్..
ప్రకాశ్ రాజ్(ఫైల్ ఫోటో)
  • Share this:
దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రకాష్ రాజ్. తాజాగా ఈ నటుడు తమిళనాడుకు సంబంధించిన ఓ విషయంలో వ్యతిరేకంగా వ్యవహరించారనేన ఆరోపణలపై  కోలీవుడ్ సినిమాల్లో ప్రకాష్ రాజ్ పై బ్యాన్ విధించాలనే దాకా వెళ్లింది. తాజాగా తమిళ మీడియా కథనం ప్రకారం ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్.. బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎంపీగా స్వతంత్య్ర అభ్యర్ధిగా  పోటీ చేసారు. మరోవైపు ప్రకాష్ రాజ్.. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కి సపోర్ట్‌గా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఎన్నికల ప్రచారంలో అరవింద్ కేజ్రీవాల్ తమిళ విద్యార్థులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. ఢిల్లీ యూనివర్సిటీలో దాదాపు 500 మంది తమిళనాడుకు చెందిన విద్యార్థులు చదువుతున్నారని, వారి మూలంగా ఢిల్లీవారికి అవకాశాలు లేకుండా పోతున్నయన్నారు. తాను ఎన్నికల్లో మళ్లీ గెలిస్తే.. ఈ పరిస్థితిలో మార్పు తీసుకొస్తానన్నారు. ఐతే ఢిల్లీలో ప్రకాష్ రాజ్..అరవింద్ కేజ్రీవాల్‌ తమిళ విద్యార్థుల  పట్ట చేసిన వ్యాఖ్యలకు మద్దతు తెలిపినట్టు కొన్ని మీడియాల్లో కథనాలు ప్రసారం అయ్యాయి. అంతేకాదు ప్రకాష్ రాజ్ తాను తమిళుడిని కాదని.. కర్ణాటక వాసినని చెప్పుకున్నట్టు  కూడా ప్రచారం జరుగుతోంది.

Prakash Raj controversial comments on Tamil students during aam aadmi party chief arvind kejriwal election campaign in new delhi,prakash raj,prakash raj twitter,prakash raj instagram,prakash raj controversial comments on tamil students,kollywood ban on prakash raj,actor prakash raj,prakash raj speech,prakash raj latest news,prakash raj news,prakash raj vs bjp,prakash raj politics,prakash raj interview,prakash raj lok sabha elections,prakash raj fires on narendra modi,prakash raj debate,prakash raj on modi,prakash raj slams bjp,actor prakash raj fires,prakash raj on hinduism,prakash raj fires on modi,prakash raj party,prakash raj angry,tollywood,kollywood,bollywood,prakash raj aam aadmi party,prakash raj aap chief aravind kejriwal,prakash raj campaingn for delhi cm aravind kejriwal,ప్రకాష్ రాజ్,ప్రకాష్ రాజ్ ట్విట్టర్,ప్రకాష్ రాజ్ ఇన్‌స్టాగ్రమ్,తమిళ విద్యార్థులపై ప్రకాష్ రాజ్ వివాదాప్పద వ్యాఖ్యలు,తమిళ స్టూడెంట్స్‌ పై ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు,ప్రకాష్ రాజ్ పై కోలీవుడ్ బ్యాన్,
అరవింద్ కేజ్రీవాల్‌తో ప్రకాష్ రాజ్


ఈ విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామితో పాటు పలువురు బీజేపీ నేతలు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలన్నారు. తమిళ సినిమాల్లో నటించడం ద్వారా ఎంతో గుర్తింపు పొందిన ప్రకాష్ రాజ్..తమిళులకు వ్యతిరేకంగా మాట్లాడటం పై తమిళనాడుకు చెందిన నెటిజన్లు ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నారు. మన దేశంలో ఎవరు ఎక్కడైనా చదువుకునే స్వేచ్ఛ ఉంది. ఈ విషయమై ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ఎవరో గిట్టని వాళ్లే కావాలనే తనపై ఈ రకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. మరి ప్రకాష్ రాజ్వి వివరణపై కోలీవుడ్ చిత్ర పరిశ్రమ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. 
Published by: Kiran Kumar Thanjavur
First published: May 6, 2019, 5:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading