Prakash Raj - Chiranjeevi: చిరంజీవిని మర్యాద పూర్వకంగా కలిసిన ప్రకాష్ రాజ్.. అసలు సంగతి అదేనా..

చిరంజీవితో ప్రకాష్ రాజ్ (Twitter/Photo)

Prakash Raj - Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని  విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.. ఆయన ఇంట్లో  మర్యాద పూర్వకంగా కలిసారు.

 • Share this:
  Prakash Raj - Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని  విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.. ఆయన ఇంట్లో  మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా డెవిల్ ఈజ్ బ్యాక్ అంటూ  ప్రకాష్ రాజ్ మెగాస్టార్‌తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రకాష్ రాజ్ ఈ మధ్య చిన్న యాక్సిడెంట్‌కు గురయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని సన్ షైన్ హాస్పిటల్‌లో ప్రత్యేక చికిత్స తీసుకున్నారు. అంతేకాదు ఆపరేషన్ చేసిన తర్వాత అదే కట్టుతో (చిరు) బాస్‌ను  ఆయన జిమ్‌లో కలిసారు.  అంతేకాదు సినీ ఇండస్ట్రీలో సమస్యల పరిష్కారం కోసం చిరంజీవి చూపుతున్న చొరవను కొనియాడారు.

  అది అలా ఉంటే ఆయన సినిమాల్లో నటిస్తూనే.. మా ప్రెసిడెంట్ (MAA Elections) పోటీలో ఉన్నారు. ఈ మా ఎన్నికలు సెప్టెంబర్‌లో జరగాల్సిఉంది. మా ఎన్నికల్లో అధ్యక్ష ప‌ద‌వి కోసం ప్రకాష్ రాజ్‌‌తో పాటు హీరో మంచు విష్ణు, జీవితా రాజశేఖర్‌, నటి హేమ, నరసింహారావు  పోటిలో ఉన్నారు. దీంతో మా ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ప్రకాష్ రాజ్ ప్యానల్‌కు మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానల్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా ‘మా’ ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలపై చర్చించినట్టు తెలుస్తోంది.  ప్ర‌కాష్ రాజ్‌ ప్యానల్‌లో జ‌య‌సుధ‌, శ్రీకాంత్, బెన‌ర్జీ, సాయికుమార్, త‌నీష్, ప్ర‌గ‌తి, అన‌సూయ‌, స‌న‌, అనితా చౌద‌రి, సుధ‌, అజ‌య్, నాగినీడు, బ్ర‌హ్మాజీ, ర‌విప్ర‌కాష్, స‌మీర్‌, ఉత్తేజ్‌, బండ్ల గ‌ణేష్, ఏడిద శ్రీరామ్‌, శివారెడ్డి, భూపాల్, టార్జాన్‌, సురేష్ కొండేటి, ఖ‌య్యూమ్‌, సుడిగాలి సుధీర్‌, గోవింద‌రావు, శ్రీధ‌ర్ రావు ఉన్నారు. ఇక ఈ పోటీలో ఉన్న నటి ఇటీవల మా ప్రెసిడెంట్ నరేష్ విషయంలో కొన్ని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే..  దీంతో నరేష్ క్రమ శిక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి కూడా వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు.

  చిరంజీవితో ప్రకాష్ రాజ్ (Twitter/Prakash Raj/Photo)


  అందులో భాగంగా ఆయన మా క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు నటుడు నిర్మాత కృష్ణంరాజుకు లేఖ రాశారు. ఈ ఎన్నికలు వెంటనే జరపాలని.. ఎలక్షన్స్ ఆలస్యమైతే సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయని తన లేఖలో పేర్కోన్నారు. మా ఎలక్షన్స్‌లో పాల్గొంటున్న సభ్యుల ప్రవర్తన తీరుకారణంగా అసోసియేషన్ ప్రతిష్ట మసకబారుతోందని.. ఈ విషయంలో అసోసియేషన్ ప్రతిష్ఠకు భంగం కలిగించేవారి విషయంలో సరైన చర్యలు తీసుకోవాలనీ చిరంజీవి తన లేఖలో స్పష్టం చేశారు. ఇక మరోవైపు చిరంజీవి లేఖ రాసిన 24గంటల్లోనే ఆయన బాటలో 113 మంది మా సభ్యులు కృష్ణంరాజుకు లేఖలు రాశారు. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ఆయన్ను కోరారు. మొత్తంగా ప్రకాష్ రాజ్.. చిరును స్వయంగా ఆయన ఇంటిలో కలవడం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

  ఇవి కూడా చదవండి.. 

  Mohan Babu: ఆ వ్యక్తి నన్ను దారుణంగా మోసం చేసారు.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..


  Tollywood Family Multistarers: టాలీవుడ్ ఫ్యామిలీ మల్టీస్టారర్స్.. మెగా, నందమూరి ఫ్యామిలీ నుంచి అక్కినేని, దగ్గుబాటి వరకు..


  Chiranjeevi : చిరంజీవి మెగాస్టార్ బిరుదు ఎవరు ఇచ్చారో తెలుసా.. దీని వెనక ఇంత పెద్ద కహానీ ఉందా..


  HBDShankar: దక్షిణాది చిత్రాల సత్తాను చూపెట్టిన ఇస్మార్ట్ డైరెక్టర్ శంకర్..

  HBD Nidhhi Agerwal : హ్యాపీ బర్త్ డే గోల్డెన్ స్టార్ నిధి అగర్వాల్.. ఈమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..


  నందమూరి నట సింహా బాలకృష్ణ తన ఫిల్మీ కెరీర్‌లో రీమేక్ చేసిన సినిమాలు ఇవే..
  Published by:Kiran Kumar Thanjavur
  First published: