• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • PRAKASH RAJ ACCEPTED GREEN INDIA CHALLENGE AND PLANTED IN HIS FARMHOUSE PK

Prakash Raj: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన ప్రకాష్ రాజ్.. కేసీఆర్‌పై ప్రశంసల జల్లు..

Prakash Raj: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన ప్రకాష్ రాజ్.. కేసీఆర్‌పై ప్రశంసల జల్లు..

ప్రకాష్ రాజ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (prakash raj green india challenge)

Prakash Raj: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అద్భుతంగా ముందుకు కొనసాగుతోంది దీనిలో పాల్గొని మొక్కలు నాటడానికి ప్రముఖులందరూ ముందుకు రావడం జరుగుతుంది.

  • Share this:
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అద్భుతంగా ముందుకు కొనసాగుతోంది దీనిలో పాల్గొని మొక్కలు నాటడానికి ప్రముఖులందరూ ముందుకు రావడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి షాద్‌నగర్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో కుమారుడితో కలిసి మొక్కలు నాటాడు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ తనికెళ్ల భరణి ఎప్పుడు కూడా చాలా మంచి చాలెంజ్‌లు తీసుకొని నాకు ఇవ్వడం జరుగుతుందని.. అందులో భాగంగా నాకు ఇష్టమైన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నాకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందిని తెలిపాడు. గౌరవ ముఖ్యమంత్రి, తనకు బాస్ అయిన కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి ఐదారు సంవత్సరాలలో తెలంగాణను ఆకుపచ్చ తెలంగాణ చేయడం జరిగిందని తెలిపాడు.
ప్రకాష్ రాజ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (prakash raj green india challenge)
ప్రకాష్ రాజ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (prakash raj green india challenge)

దానికి కారణం ముఖ్యమంత్రి కెసిఆర్ గారి 10 సంవత్సరాల విజన్ అంటున్నాడు ప్రకాష్ రాజ్. ముఖ్యమంత్రి కెసిఆర్ రాజ్యసభ సభ్యులు సంతోష్ మట్టి మనుషులని.. మట్టితో వాళ్లకి అవినాభావ సంబంధం ఉందని చెప్పాడు. కాబట్టి ఆ మట్టి పరిమళం విలువ వాళ్లకు తెలుసు అంటున్నాడు ఈయన. వాళ్లు మట్టితో మాట్లాడుతారు కాబట్టి మట్టికి చెట్టుకు ఉన్న అనుబంధంతో ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని.. మొక్కలు పెంచే బాధ్యత మనందరిదీ ప్రభుత్వం చేస్తుంది కదా అని కాకుండా మనం కూడా బాధ్యతగా తీసుకొని చెట్లను పెంచే కార్యక్రమం చేపట్టాలని సూచించారు.
ప్రకాష్ రాజ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (prakash raj green india challenge)
ప్రకాష్ రాజ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (prakash raj green india challenge)

ఈ మధ్య కాలంలో తెలంగాణ అంతటా పచ్చదనం చాలా పెరిగిపోయిందని తెలిపాడు ప్రకాష్ రాజ్. పచ్చదనంతో పాటు వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు పెరిగిపోయి చెరువులు అలుగులు పారుతున్నాయని.. దీనివల్ల ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ అయిన బంగారు తెలంగాణ సహకారం దగ్గర్లోనే ఉందని తెలిపాడు ప్రకాష్ రాజ్.

మరొక్కసారి ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి దేశవ్యాప్తంగా అందరిచేత మొక్కలు నాటి ఇస్తూ పచ్చదనం పెంచడం కోసం కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు సంతోష్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను అని చెప్పాడు ఈయన. ఈ చాలెంజ్ ఇదే విధంగా కొనసాగాలని.. అందులో భాగంగా తన మిత్రుడు, మహా నటుడు మోహన్ లాల్, తమిళ్ నటుడు సూర్య , కన్నడ నటుడు రక్షిత్ శెట్టి, హీరోయిన్లు రమ్యకృష్ణ, త్రిషలను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరాడు ప్రకాష్ రాజ్.
Published by:Praveen Kumar Vadla
First published: