జీ తెలుగు లో ప్రసారం కానున్న 'నాగభైరవి' సీరియల్ తనదైన శైలిలో ప్రజల యొక్క హృదయాల్ని గెలుచుకుంది. ఈ సీరియల్ కి ప్రతేయక ఆకర్షణగా నిలిచింది నాగార్జున (పవన్) మరియు భైరవి (యాష్మి గౌడ) మధ్య నడుస్తున్న చిలిపి ప్రేమకథ. ఇప్పటి వరకు జరిగిన కథ విషయానికి వస్తే, భైరవి తన చేతికి ఉన్న కంకణం కోల్పోవడం వల్ల ఆ కంకణం నాగార్జునను చేరుకుంటుంది. ఆ తర్వాత నాగార్జున తన స్వప్న సుందరి భైరవి అని తెలుసుకొని తనని, తన దానిగా చేసుకోవడానికి నాగవరంకి మళ్ళి వస్తాడు.
తెలుగు ప్రజలని మరింత మైమరిపించడానికి, జీ తెలుగు యొక్క పాపులర్ జోడి అయినా ప్రజ్వల్ మరియు అనూష, శివుడు ఇంకా పార్వతిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అదే విధంగా, శృతి సింగంపల్లి మాంత్రికురాలిగా, కల్యాణ వైభోగమే సీరియల్ భావన సోదమ్మగా మరియు అత్తారింట్లో అక్క చెల్లలు సీరియల్ ఫేమ్ మధు విశ్వంభర గా సీరియల్లో ప్రవేశం చేయనున్నారు.
మరి ఇన్ని అతీంద్రియ శక్తుల మధ్య ఏ విధంగా నాగార్జున మరియు భైరవి నాగవరం లో ఉన్న గుడి రహస్యం గురించి తెలుసుకుంటారా? అనేది తేలాల్సి ఉంది. పవన్ మరియు కల్కి రాజా వారి బ్యానర్ అయిన 27 పిక్చర్స్ ఆధ్వరంలో నిర్మిస్తున్న'నాగభైరవి' సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7: 30 గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్ డి లో ప్రసారం కానుంది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.