Pragathi : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న అతికొద్ది మంది మహిళా క్యారెక్టర్ ఆర్టిస్టులలో ప్రగతి కూడా ఒకరు. హీరోయిన్ తల్లిగా.. వదినగా చాలా సినిమాల్లో యాక్ట్ చేసింది. తాజాగా ఈమె చేసిన నాగిన్ డాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Pragathi : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న అతికొద్ది మంది మహిళా క్యారెక్టర్ ఆర్టిస్టులలో ప్రగతి కూడా ఒకరు. హీరోయిన్ తల్లిగా.. వదినగా చాలా సినిమాల్లో యాక్ట్ చేసింది. అప్పట్లో చిరుత సినిమాలో రామ్ చరణ్ తల్లిగా కూడా ఈమె నటించింది. ఆ తర్వాత కూడా చాలా సినిమాలు చేసింది.. తనకంటే చాలా పెద్ద హీరోలకు కూడా అమ్మగా నటించి మెప్పించారు ప్రగతి. ఆ మధ్య కరోనా లాక్డౌన్ నేపథ్యంలో అన్నిరకాలు షూటింగ్స్ రద్దు చేసారు. దీంతో ఆర్టిస్టులు అందరు ఇంటికే పరిమితమయ్యారు. ఈ సందర్భంగా నటీనటులు తమకు సంబంధించిన టాలెంట్‌ను వీడియోల రూపంలో షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే కదా.కొందరు వంటలు చేస్తుంటే, మరికొందరు బొమ్మలెస్తున్నారు. ఇంకొందరు డ్యాన్స్‌లతో ఇరగదీసారు.
అందులో భాగంగా తాజాగా ప్రముఖ క్యారక్టర్ నటి ప్రగతి ఇప్పటికే కొన్ని డాన్సు స్టెప్పులతో సోషల్ మీడియాలో రచ్చ చేసింది. ఇప్పటికే తమిళ స్టార్ విజయ్ సినిమా మాస్టర్ లోని ఓ మాస్ పాటకు లుంగీ కట్టి మాస్ డ్యాన్స్ చేసిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
ప్రగతి ఎప్పటి కపపుడు తన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ని షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. అలా తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ పోతోంది. రీసెంట్గా ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే సందర్భంగా తన స్నేహితురాలితో కలిసి పాపులర్ తమిళ సాంగ్ 'ఫేమస్ డ్రీమమ్ వేకపమ్'కు దుమ్ములేపింది. తాజాగా నాగిన్ డాన్స్‌కు డాన్స్ చేసిన వీడియోను అభిమానులతో షేర్ చేసుకుంది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్ అవుతోంది.
ఇక ఇది చూసిన నెటిజన్స్ ప్రగతి మీరు సూపర్ డాన్సర్ అంటు మెచ్చుకుంటున్నారు. ఈ ఏజ్‌లో కూడా ఫిట్‌గా ఉంటూ ఎంతో ఎనర్జీగా డ్యాన్స్ చేశారంటూ పలువురు నెటిజన్లు ఈ నటి డ్యాన్స్‌కు ఫిదా అవుతున్నారు. మరికొందరు ఇదేంటనీ విమర్శిస్తున్నారు.
ఏదిఏమైనా ప్రగతి డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఇక ప్రగతి సినిమాల విషయానికి వస్తే.. తెలుగు సినిమాల్లో ప్రగతి ముఖ్యంగా అమ్మగా, వదినగా, అక్కగా, చెల్లిగా కనిపిస్తూ ఉంటుంది. ఆమె ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.