యాంకర్ ప్రదీప్ గ్రాండ్ రీ ఎంట్రీ.. సుధీర్‌కు పోటు దించేశాడుగా..

యాంకర్ ప్రదీప్

Pradeep Machiraju : ప్రదీప్ మాచిరాజు.. బుల్లితెరపై ప్రత్యేకమైన యాంకరింగ్‌తో ప్రేక్షకులను మెప్పిస్తున్న యాంకర్. ముఖ్యంగా అల్టిమేట్ డ్యాన్సులతో ఉర్రూతలూగించే ‘ఢీ’ షోలో ప్రదీప్ చేసే యాంకరింగ్ అద్భుతం.

  • Share this:
    ప్రదీప్ మాచిరాజు.. బుల్లితెరపై ప్రత్యేకమైన యాంకరింగ్‌తో ప్రేక్షకులను మెప్పిస్తున్న యాంకర్. ముఖ్యంగా అల్టిమేట్ డ్యాన్సులతో ఉర్రూతలూగించే ‘ఢీ’ షోలో ప్రదీప్ చేసే యాంకరింగ్ అద్భుతం. అయితే.. ఈ సారి ప్రారంభమైన ఢీ ఛాంపియన్స్ కార్యక్రమంలో ప్రదీప్ పాల్గొనలేదు. అనారోగ్య కారణాల రీత్యా కొన్ని రోజుల దూరంగా ఉన్నా.. మరో ఛానల్‌లో ప్రసారమైన ఓ షోలో ప్రదీప్ పాల్గొనడంతో ఇక ఢీ కి సెలవు చెబుతాడని అంతా అనుకున్నారు. అయితే, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ఈ వారానికి సంబంధించిన ఢీ ఛాంపియన్స్ ఎపిసోడ్ ప్రోమోను గత వారం విడుదల చేయగా అందులో.. ప్రదీప్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని కన్‌ఫార్మ్ అయ్యింది. యాంకర్ రవి స్థానంలో హైపర్ ఆది ఎంట్రీ ఇస్తున్నట్లు తెలిసింది. అందుకు తగ్గట్లు.. నిన్న ప్రసారమైన ఢీ ఛాంపియన్స్‌లో వీరిద్దరు గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. ముఖ్యంగా ప్రదీప్ రీ ఎంట్రీ ఇవ్వడం ప్రేక్షకుల్లో జోష్ పెంచింది. తనదైన స్టైల్, యాంకరింగ్ విధానంతో మరోసారి ఢీ షోకు పూర్వవైభవం తెచ్చినట్లుగా కనిపించింది.

    వచ్చీ రావడంతోనే సుధీర్‌కు పంచ్‌లతో చుక్కలు చూపించాడు. అసలే వీరిద్దరి కామెడీ కాంబినేషన్‌ను చూసుకొని ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వేస్తారు. ఇక, చాలా రోజుల తర్వాత ప్రదీప్ రీ ఎంట్రీ ఇవ్వడంతో పాటు, సుధీర్‌కు పంచ్‌లు వేయడంతో షో రక్తి కట్టింది. అటు.. హైపర్ ఆది కూడా తన పంచ్‌లు, కామెడీ టైమింగ్‌తో సుధీర్‌ను బకరా చేసేశాడు. ఇదంతా చూసిన ప్రదీప్.. మరింత కామెడీ పండించేలా వ్యవహరించిన తీరు షోకు హైలైట్ అయ్యింది.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: