యాంకర్ ప్రదీప్ బర్త్ డే స్పెషల్.. అతడి జీవితంలో విశేషాలివీ..

యాంకర్ ప్రదీప్

తన గాత్రంతో, సమయస్ఫూర్తితో టీవీ వ్యాఖ్యాతగా రాణిస్తూ ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న ప్రదీప్.. ఈ రోజు జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన జీవితంలోని పలు విశేషాలు పాఠకుల కోసం...!

  • Share this:
    యాంకర్ ప్రదీప్.. ఈ పేరు వింటే తెలుగు బుల్లి తెర ఎగిరి డ్యాన్స్ చేస్తుంది. తన గాత్రంతో, సమయస్ఫూర్తితో టీవీ వ్యాఖ్యాతగా రాణిస్తూ ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న ప్రదీప్.. ఈ రోజు జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన జీవితంలోని పలు విశేషాలు పాఠకుల కోసం...! ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో పుట్టిన ప్రదీప్.. హైదరాబాద్‌లోని విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఈఈఈలో బీటెక్ చేశాడు. ఆ తర్వాత ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలో పనిచేశాడు. రేడియో మిర్చిలో రేడియో జాకీగా ఉద్యోగం రావడంతో అతడు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అతడి గాత్రం కెరీర్‌ ఊపందుకోవడానికి బాగా ఉపయోగపడింది. కొంచెం టచ్‌లో ఉంటే చెబుతా కార్యక్రమాన్ని రూపొందించి దానికి వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఆ షో ప్రదీప్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. గడసరి అత్త సొగసరి కోడలు కార్యక్రమం ఇతడికి నంది అవార్డు అందించింది.

    ‘ఢీ’ షో అయితే ప్రదీప్‌కు బోలెడంత పేరును సంపాదించి పెట్టింది. ఆ షో లో సుడిగాలి సుధీర్‌తో చేసే కామెడీ, పంచ్‌లు బాగా పండాయి. దీంతో ప్రదీప్ అంటే అమ్మాయిల్లోనూ క్రేజ్ పెరిగింది. సోషల్ మీడియాలో అతడికి ఫాలోయింగ్ బీభత్సంగా ఉంది. సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రలు వేషి మెప్పించాడు ప్రదీప్. 100% లవ్, జులాయి, అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా తదితర సినిమాల్లో నటించాడు.

    అయితే, 2017 డిసెంబరు 31 సందర్భంగా నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని మోతాదుకు మించి మద్యం సేవించడంతో ప్రదీప్‌పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. కారు స్వాధీనం చేసుకొని కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ ఘటన ప్రదీప్‌ను కాస్త ఇబ్బంది పెట్టింది. సెలబ్రిటీ కావడం వల్ల అతడి ఫేమ్ దెబ్బతిన్నది. కానీ, త్వరగానే కోలుకొని ‘ప్రదీప్ ఈజ్ బ్యాక్’ అనిపించాడు. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ, కెరీర్‌లో గొప్ప స్థితిలో కొనసాగుతున్నాడు. ప్రదీప్ ఇలాగే తన కెరీర్‌ను కొనసాగించి, ప్రేక్షకులను మరింత అలరించాలని మనమూ కోరుకుందాం.
    First published: