హోమ్ /వార్తలు /సినిమా /

Abhinetri Trailer Talk: ‘అభినేత్రి 2’ తమన్నా ఓ రేంజ్‌లో రెచ్చిపోయిందిగా..

Abhinetri Trailer Talk: ‘అభినేత్రి 2’ తమన్నా ఓ రేంజ్‌లో రెచ్చిపోయిందిగా..

అభినేత్రి 2 లో ప్రభుదేదా,తమన్నా

అభినేత్రి 2 లో ప్రభుదేదా,తమన్నా

ప్రభుదేవా, తమన్నా జంటగా నటించిన అభినేత్రి అప్పట్లో ఓ మోస్తరుగా మంచి విజయాన్నే నమోదు చేసింది. ఇపుడీ సినిమాకు సీక్వెల్‌గా ‘అభినేత్రి 2’ తెరకెక్కింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ విడుదలైంది.

    ప్రభుదేవా, తమన్నా జంటగా నటించిన అభినేత్రి అప్పట్లో ఓ మోస్తరుగా మంచి విజయాన్నే నమోదు చేసింది. ఇపుడీ సినిమాకు సీక్వెల్‌గా ‘అభినేత్రి 2’ తెరకెక్కింది. మొదటి పార్ట్‌ను తెరకెక్కించిన ఏ.ఎల్.విజయ్ ఈ సీక్వెల్‌ను డైరెక్ట్ చేసాడు. ఈ సినిమాలో ప్రభుదేవా, తమన్నా హీరో, హీరోయిన్స్‌గా నటించారు.సోనూసూద్‌తో పాటు నందితా శ్వేత, కోవై సరళలు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్,ట్రైడెంట్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ నామా, రవీంద్రన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను మే 31న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్‌ను విడుదల చేసారు.

    ' isDesktop="true" id="211530" youtubeid="mg9raN8647w" category="movies">


    ఈ ట్రైలర్ కూడా అమాకయమైన భార్యను మభ్య పెట్టే భర్త పాత్రలో ప్రభుదేవా నటించాడు. అతన్ని దెయ్యం ఆవహిస్తుంది. దాంతో అతని భార్య ఏం చేస్తుందనేదే ఈ సినిమా స్టోరీలా ఉంది. ఈ సినిమాలో మరోసారి తనదైన రేంజ్‌లో ఎక్స్‌పోజింగ్ చేసి అభిమానులను కనువిందు చేసింది. అంతకు ముందు ‘ఎఫ్’2’లో కూడా తమన్నా ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. మరి అభినేత్రిలా ఈ సీక్వెల్‌ కూడా సక్సెస్ అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

    First published:

    Tags: Abhinetri 2 Movie Review, Kollywood, Prabhu deva, Tamannah, Tamil Cinema, Telugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు