Prabhu Deva : ప్రభుదేవా సంచలన నిర్ణయం.. ఇకపై వాటికి దూరం అంటున్న డాన్స్ మాస్టర్. వివరాల్లోకి వెళితే.. ప్రభుదేవా తన తండ్రి సుందరం మాస్టర్ దగ్గర అసిస్టెంట్‌గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత కొరియోగ్రాఫర్‌గా పలు చిత్రాలకు పని చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘అగ్ని నక్షత్రం’ సినిమాలో రాజా రాజాధి రాజా అంటూ ఈయన కంపోజ్ చేసిన పాట అప్పట్లో పెద్ద సంచనలనం. ఈ సినిమాను తెలుగులో ‘ఘర్షణ’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇక శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జెంటిల్మెన్’ సినిమాలో చికు బుకు చికు బుకు రైలే అంటూ హీరోయిన్ గౌతమితో కలిసి ప్రభుదేవా డాన్స్ మూమెంట్స్ అప్పట్లో ఓ సెన్సేషన్.
ఆ తర్వాత అదే శంకర్ (Shankar) దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమికుడు’ సినిమాలో హీరోగా ప్రమోషన్ పొందాడు. ఆ తర్వాత నటుడిగా పలు సినిమాల్లో నటించారు. అంతేకాదు ప్రభుదేవా కేవలం తెలుగు చిత్ర పరిశ్రమకే పరిమితం కాలేదు. తెలుగుతో పాటు హిందీతో పాటు కన్నడలో పలు చిత్రాల్లో నటించిన హీరోగా సత్తా చాటారు. నటుడిగా ఓ వైపు నటిస్తూనే.. తెలుగులో ‘నువ్వు వస్తానంటే నేనొద్దాంటానా’ సినిమాతో డైరెక్టర్‌గా మెగాఫోన్ పట్టుకున్నారు.
అప్పటి తరంలో చిరంజీవి, మోహన్ బాబు.. ఇప్పటి జనరేషన్‌లో రవితేజ, విజయ్ దేవరకొండ..
ఆ సినిమా బంపర్ హిట్ అయింది. కానీ ఈ సినిమా సల్మాన్ ఖాన్ (Salman Khan) నటించిన ‘ప్యార్ కియాతో డర్నా కా’ సినిమాకు రీమేక్ అనే విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ప్రభాస్‌తో ఎన్నో అంచనాలతో తెరకెక్కించిన ‘పౌర్ణమి’ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
HBD Krithi Shetty: హ్యాపీ బర్త్ డే ఉప్పెన భామ కృతి శెట్టి.. ఈమె గురించి ఈ నిజాలు తెలుసా..
ఆ తర్వాత తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పోకిరి’ సినిమాను తమిళంలో ‘పొక్కిరి’ గా విజయ్, అసిన్‌లతో రీమేక్ చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత ఇదే సినిమాను సల్మాన్ ఖాన్‌తో బాలీవుడ్‌లో ‘వాంటెడ్’ పేరుతో రీమేక్ చేసి ఫ్లాపుల్లో ఉన్న సల్మాన్ ఖాన్‌ను విజయ తీరాలకు చేర్చారు.
బాలయ్య సినిమా టైటిల్‌తో బాక్సాఫీస్ పై గర్జించడానికి రెడీ అవుతున్న షారుఖ్ ఖాన్..
ఈ మధ్యలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తో ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా హిందీలో రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో సంజయ్ దత్ హీరోగా నటించిన ‘లగే రహో మున్నాభాయ్’ సినిమాకు రీమేక్. కానీ తెలుగులో ఈ సినిమా అనూహ్యంగా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత ప్రభుదేవా హిందీలో పలు చిత్రాలను తెరకెక్కిస్తూ బిజీగా మారారు.
రీసెంట్‌గా సల్మాన్ ఖాన్ హీరోగా ‘రాధే’ సినిమాతో పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలవడంతో పాటు సల్మాన్‌తో పాటు దర్శకుడిగా ప్రభుదేవాను విమర్శల పాలు చేసింది. అంతకు ముందు సల్మాన్ ఖాన్ తో చేసిన ‘దబాంగ్ 3’ కూడా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఈ నేపథ్యంలో ప్రభుదేవా ఇకపై దర్శకత్వానికి దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
దర్శకుడిగా వరుస ఫ్లాపులతో పాటు.. నటుడిగా అవకాశాలు రావడంతో ప్రభుదేవా ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. త్వరలో ప్రభుదేవా ‘భగీరా’ అనే సినిమాతో పలకరించనున్నారు. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో విడుదల కానుంది. ఇక ప్రభుదేవా కొరియోగ్రాఫర్‌గా మారిన తర్వాత తను దర్శకత్వం వహించే సినిమాలతో పాటు ఒకటి రెండు సినిమాలకు మాత్రమే కొరియోగ్రాఫర్ అందించారు. మొత్తంగా దర్శకత్వానికి దూరంగా ఉంటాననే ప్రభుదేవా నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood news, Kollywood, Prabhu deva, Tollywood