ప్రభుదేవా.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. డాన్సర్‌గా వచ్చి నటుడిగా మారి కొరియోగ్రఫర్‌గా ఎదిగి స్టార్ అయ్యాడు ఈయన. దర్శకుడుగా కూడా తనకంటూ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. చిరంజీవి నుంచి చిన్న హీరోల వరకు అందర్నీ డైరెక్ట్ చేసాడు ఈయన. తెలుగుతో పాటు తమిళ, హిందీ ఇండస్ట్రీలలో కూడా సినిమాలు చేసాడు ప్రభుదేవా. దాంతో పాటు రొమాన్స్‌లో కూడా ఈయన కింగే. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఎఫైర్స్ నడుపుతుంటాడనే పేరు కూడా ఉంది. దర్శకుడిగా ఉంటూనే హీరోయిన్లతో రొమాన్స్ చేయడం కూడా ప్రభుదేవాకు అలవాటే. అలాగే నయనతారతో ఈయన ప్రేమాయణం ఇండియన్ వైడ్‌గా ట్రెండ్ అయింది. అప్పట్లో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకుంటారనే అంతా అనుకున్నారు. నయనతార ఈయన కోసం ఏకంగా మతం కూడా మార్చుకుంది. అంతా ఓకే అనుకుంటున్న తరుణంలో అంతా మారిపోయింది. ప్రస్తుతం ఈయన కెరీర్ బాలీవుడ్‌లో బిజీగా ఉన్నాడు. కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో కలిసి ప్రభుదేవా రాధే సినిమా చేస్తున్నాడు.
ఇందులో దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే సల్మాన్‌తో దబంగ్ 3, వాంటెడ్ లాంటి సినిమాలు చేసాడు ప్రభుదేవా. ఇప్పుడు రాధే సినిమాను కూడా పూర్తి చేసి వచ్చే ఏడాది ఈద్ కానుకగా విడుదల చేయాలని చూస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈయన వ్యక్తిగత జీవితం కూడా ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటుంది. తాజాగా ప్రభు రెండో పెళ్లికి సిద్ధమవుతున్నాడని ప్రచారం జరుగుతుంది. 1995లో రామలతను వివాహం చేసుకున్న ఈయన 2011లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
అప్పట్లో ఆమెకు భారీగానే భరణం కూడా ఇచ్చాడంటూ ప్రచారం జరిగింది. ఇదిలా ఉంటే అప్పట్నుంచి ఒంటరిగానే ఉన్న ప్రభుదేవా ఇప్పుడు తన కుటుంబంలోనే తెలిసిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంటుంది. మరోవైపు నయనతార మాత్రం శింబు, ప్రభుదేవాతో విడిపోయిన తర్వాత ప్రస్తుతం విఘ్నేష్ శివన్‌తో రిలేషన్‌లో ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Prabhu deva, Telugu Cinema, Tollywood