నటుడు, దర్శకుడు ప్రభుదేవా సినిమాల కంటే కూడా పర్సనల్ లైఫ్‌తోనే ఎక్కువగా హెడ్ లైన్స్‌లో ఉంటాడు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. ఈయన కెరీర్ అంతా సాఫీగానే ఉన్నా.. వ్యక్తిగతంగా మాత్రం వివాదాలమయంగానే ఉంది. ముఖ్యంగా పెళ్లి విషయంలో ఈయన కాంట్రవర్సీలతోనే ఉంటాడు. తాజాగా ఈయన రెండో పెళ్లి చేసుకున్నాడని ప్రచారం జరుగుతుంది. సెప్టెంబర్‌లోనే ఈయన రెండో పెళ్లి చేసుకున్నాడని తెలుస్తుంది. ఈ విషయం ఇన్ని రోజలు బయటికి రాలేదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో అదే ట్రెండ్ అవుతుంది. 1995లో రమాలత్‌ను పెళ్లి చేసుకున్న ప్రభుదేవా.. 16 ఏళ్ళ తర్వాత విడిపోయాడు. 2011లో ఈయన విడాకులు తీసుకున్నాడు. అప్పుడు హీరోయిన్ నయనతార కారణంగా తొలి భార్యకు విడాకులు ఇచ్చాడు. అప్పట్లో ఈ ఇద్దరూ ప్రేమించుకున్నారు.. ఓ దశలో పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అందుకే పూజలు, పునస్కారాలు కూడా చేసారు. కానీ ఆ సమయంలో కొన్ని కారణాలతో విడిపోయారు.
బ్రేకప్ తర్వాత ప్రభుదేవా సింగిల్ అయిపోయాడు.. కానీ నయనతార మాత్రం విఘ్నేష్ శివన్‌తో ప్యాకప్ అయిపోయింది. నాలుగేళ్లుగా ఈయనతోనే రిలేషన్‌లో ఉంది నయన్. ఇదే సమయంలో ఇప్పుడు ప్రభుదేవా కూడా రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈయన ఓ డాక్టర్‌ను పెళ్లి చేసుకున్నాడని చెన్నై మీడియాలో వస్తున్న సమాచారం. ముంబైలో వీళ్ల పెళ్ళి జరిగిందని.. అక్కడే ఉంటున్నారని ప్రచారం జరుగుతుంది. అప్పట్లో ప్రభుదేవా కొన్ని రోజలు వెన్నునొప్పితో బాధ పడ్డాడు. అలాంటి సమయంలో ప్రభుదేవాకు ఓ డాక్టర్ వచ్చి ఫిజియోతెరపీ చేసింది.
ఆ సమయంలోనే ఆ వైద్యురాలితో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లితో ఒక్కటయ్యారని తెలుస్తుంది. కానీ ఇంత పెద్ద విషయం బయటికి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు ప్రభుదేవా. పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా కెరీర్ పరంగా మాత్రం దూసుకుపోతున్నాడు ప్రభుదేవా. ఈయనకు వరస అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ నుంచి స్టార్ హీరోలు ఈయన కావాలంటున్నారు. తాజాగా సల్మాన్ ఖాన్ హీరోగా రాధే సినిమా చేస్తున్నాడు ప్రభుదేవా. ఈ సినిమా షూటింగ్ సైలెంట్‌గా జరుగుతుంది. వచ్చే ఏడాది ఈద్ కానుకగా విడుదల కానుంది రాధే. మొత్తానికి రెండో పెళ్లితో మరోసారి హాట్ టాపిక్ అయిపోయాడు ప్రభుదేవా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Prabhu deva, Telugu Cinema, Tollywood