హోమ్ /వార్తలు /సినిమా /

నయనతార నా కాపురంలో నిప్పులు పోసింది.. ప్రభుదేవా మాజీ భార్య ఫైర్..

నయనతార నా కాపురంలో నిప్పులు పోసింది.. ప్రభుదేవా మాజీ భార్య ఫైర్..

ప్రభుదేవా: 20 ఏళ్ల కిందే రమాలత్‌తో ప్రభుదేవా పెళ్లి జరిగింది. కానీ కొన్ని కారణాలతో విడిపోయాడు. ఆ తర్వాత నయనతారతో పెళ్లి వరకు వచ్చిన వ్యవహారం బెడసికొట్టింది. ఆ తర్వాత ఈ మధ్యే తనకు ఫిజియోతెరపీ చేసిన డాక్టర్‌నే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ప్రభుదేవా.

Nayanthara Prabhudeva: దక్షిణాదిన నయనతార లవ్ స్టోరీస్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ముందు శింబు.. ఆ తర్వాత కొరియోగ్రాఫర్ కమ్ హీరో కమ్ దర్శకుడు ప్రభుదేవాతో ప్రేమాయణం నడిపింది.

దక్షిణాదిన నయనతార లవ్ స్టోరీస్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ముందు శింబు.. ఆ తర్వాత కొరియోగ్రాఫర్ కమ్ హీరో కమ్ దర్శకుడు ప్రభుదేవాతో ప్రేమాయణం నడిపింది. ఇప్పుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో ఉంది నయనతార. మరీ ముఖ్యంగా ప్రభుదేవాతో ఈమె నడిపిన ఘాటు ప్రేమాయణంపై అప్పట్లో మీడియాలో చాలా వార్తలే వచ్చాయి. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అందుకే తన భార్య రమావత్‌కు విడాకులు కూడా ఇచ్చాడు ప్రభుదేవా. కానీ చివరి నిమిషంలో ఇద్దరూ విడిపోయారు. అయితే ఆ విషయం అంతా మరిచిపోయారు.. ప్రభుదేవా కూడా తన పనులు తాను చేసుకుంటున్నాడు.

నయనతారపై మండి పడుతున్న ప్రభుదేవా మాజీ భార్య (prabhu deva nayanthara ramlath)
నయనతారపై మండి పడుతున్న ప్రభుదేవా మాజీ భార్య (prabhu deva nayanthara ramlath)

కానీ ఆయన భార్య రమాలత్ మాత్రం ఇప్పటికీ నయనతారపై చిందులు తొక్కుతూనే ఉందని తెలుస్తుంది. ఆమె కనిపిస్తే చంపేయాలన్నంత కసితో రమాలత్ ఉందని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు కూడా నయనతారను విమర్శిస్తుంది ఈమె. తన కాపురం ఆమె వల్లే నాశనం అయిందని సన్నిహితులతో చెప్పుకుని ఏడుస్తుందని తెలుస్తుంది. ప్రభుదేవా, రమాలత్‌ది ప్రేమ వివాహం.. 1995లో వారిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. రమలాత్ ముస్లిం అమ్మాయి అయినా కూడా ప్రభుదేవా కోసం మతం కూడా మార్చుకుంది.. ఆ తర్వాత ఇద్దరూ 15 ఏళ్ల పాటు హాయిగా ఉన్నారు.

నయనతారపై మండి పడుతున్న ప్రభుదేవా మాజీ భార్య (prabhu deva nayanthara ramlath)
నయనతారపై మండి పడుతున్న ప్రభుదేవా మాజీ భార్య (prabhu deva nayanthara ramlath)

ఈ క్రమంలోనే వాళ్ల దాంపత్య జీవితంలో ఒక్కసారిగా భారీ కుదుపులు మొదలయ్యాయి. ప్రభుదేవా జీవితంలోకి నయనతార వచ్చిన తర్వాత భార్యతో గొడవలు మొదలయ్యాయి. అప్పుడే ప్రభుదేవా కుమారుడు క్యాన్సర్ వ్యాధితో 2008లో చనిపోయాడు. ఆ తర్వాత గొడవలు తారాస్థాయికి చేరిపోయాయి. నయనతార కోసమే 2011లో తన భార్య రమాలత్‌కు విడాకులు కూడా ఇచ్చాడు ప్రభుదేవా. దానికోసం ఆమెకు భారీగా భరణం కూడా ఇచ్చాడని అప్పట్లో భారీగానే ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత నయన్‌ను కూడా వదిలేసాడు ప్రభు.

నయనతారపై మండి పడుతున్న ప్రభుదేవా మాజీ భార్య (prabhu deva nayanthara ramlath)
నయనతారపై మండి పడుతున్న ప్రభుదేవా మాజీ భార్య (prabhu deva nayanthara ramlath)

ఇది జరిగి చాలా ఏళ్ళవుతున్నా కూడా నయనతార వల్లే తన జీవితం.. కాపురం.. అంతా నాశనమైపోయిందని.. తన బతుకు రోడ్డున పడిందని రమాలత్ మండి పడుతుంది. తన భర్తను తనకు కాకుండా చేసిన నయనతారను దేవుడు శిక్షిస్తాడని.. పెళ్లైన మగాళ్ల వైపు చూసే ఆడవాళ్లను కఠినంగా శిక్షించాలని ఆమె కోరుకుంటుంది. తనంటే ప్రాణమిచ్చే భర్తను తనకు కాకుండా చేసిన నయనతార అంతకంత తన జీవితంలో అనుభవిస్తుందని శాపనార్థాలు పెడుతుంది రమాలత్. 15 ఏళ్లు తన మొగుడు తనను దేవతలా చూసుకున్నాడని.. ఇల్లు పని తప్ప మరోటి తెలియని తనను నయనతార ఏం మాయ చేసిందో అంటూ వాపోతుంది ఈమె. మొత్తానికి ప్రభుదేవా భార్య మాటలతో మరోసారి నయన్ టాపిక్ హైలైట్ అవుతుంది.

First published:

Tags: Nayanthara, Prabhu deva, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు