జక్కన్న చెక్కిన ‘బాహుబలి’ ఇంటా బయటా రచ్చ చేసింది. విడుదలై రెండేళ్లు కావొస్తోన్న ఏదో ఒక రూపంటో ‘బాహుబలి’ రికార్డుల మోత మోగిస్తూనే ఉంది. జానపద కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా భారతీయ చిత్ర పరిశ్రమలో అన్ని రికార్డులను తిరగ రాసింది. ఇప్పటికీ ‘బాహుబలి’ క్రియేట్ చేసిన రికార్డులను ఏ సినిమా క్రాస్ చేయలేకపోయింది.
తాాజాగా ‘బాహుబలి’ సినిమా మరో అరుదైన రికార్డును సొంత చేసుకుంది. ఓర్మాక్స్ మీడియా విడుదల చేసిన ఉత్తమ చిత్రాల లిష్టులో బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచింది.
ఓర్మాక్స్ అనే సంస్థ గత పదేళ్ల నుంచి దేశంలోని అత్యుత్తమ చిత్రాల లిస్టును ప్రిపేర్ చేస్తోంది. థియేటర్స్ వద్ద ప్రేక్షకుల అభిప్రాయాలు, వాళ్ల ఇష్టాఇస్టాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఈ జాబితాను రూపొందిస్తూ వస్తున్నారు. ప్రతి ఏడాది హిందీలో విడుదలయ్యే చిత్రాలతో పాటు ప్రేక్షకులను ఎక్కువగా ఇంప్రెస్ చేసిన చిత్రాలతో ఈ జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది. తాజాగా పదేళ్లలో ప్రేక్షకులు ఎక్కువ ఇష్టపడ్డ పది చిత్రాల జాబితాను ఓర్మాక్స్ సంస్థ విడుదల చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Prabhas, Rajamouli, Telugu Cinema, Tollywood