PRABHAS YASH AS LIKE PRABHAS ROUTE YASH OWN DUBBING FOR KGF 2 HINDI VERSION TA
Prabhas - Yash: ప్రభాస్ బాటలో ఆ పని చేయబోతున్న యశ్.. కేజీఎఫ్ స్టార్ సాహాసానికి ఫ్యాన్స్ ఫిదా..
ప్రభాస్, యశ్ (Twitter/Photo)
Prabhas - Yash: అవును కేజీఎఫ్ స్టార్ యశ్.. ఇపుడు రెబల్ స్టార్ ప్రభాస్ బాటలో వెళ్లాలని చూస్తున్నాడు. అది కూడా కేజీఎఫ్ 2 హిందీ వెర్షన్ కోసం. వివరాల్లోకి వెళితే..
Prabhas - Yash: అవును కేజీఎఫ్ స్టార్ యశ్.. ఇపుడు రెబల్ స్టార్ ప్రభాస్ బాటలో వెళ్లాలని చూస్తున్నాడు. అది కూడా కేజీఎఫ్ 2 హిందీ వెర్షన్ కోసం. వివరాల్లోకి వెళితే.. గత కొన్నేళ్లుగా మన హీరోలు..ఒక భాషకే పరిమతం కాకుండా అన్ని భాషల్లో తమ మార్కెట్ పెంచుకునే పనిలో పడ్డారు. బాహుబలి పుణ్యమా అని తెలుగు సినిమాలకు దేశ వ్యాప్తంగా మార్కెట్ పెరిగింది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన ’సాహో’ సినిమా హిందీ బెల్ట్‌లో దాదాపు రూ. 200 కోట్లకు పైగా రాబట్టింది. బాహుబలితో వచ్చిన క్రేజ్‌తో సాహో హిందీ డబ్బింగ్ వెర్షన్ కోసం ప్రభాస్ ఓన్ డబ్బింగ్ చెప్పుకున్నాడు. ఇపుడు రాబోయే.. ‘రాధే శ్యామ్’తో పాటు, ఆదిపురుష్’, సలార్ హిందీ వెర్షన్స్ కోసం ప్రభాస్ ఓన్ డబ్బింగ్ చెబుతున్నాడు. మరోవైపు తమిళం, కన్నడలో కూడా సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు.
మరోవైపు ఆర్ఆర్ఆర్ కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కూడా హిందీతో పాటు తమిళం, కన్నడలో వాళ్ల పాత్రకు వాళ్లే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. ఏదో హిందీలో సినిమా చేస్తున్నా అని కాకుండా అక్కడివాళ్లకు కనెక్ట్ కానీకి హిందీతో పాటు ఇతర భాషల్లో ఓన్ డబ్బింగ్ చెప్పుకునే పనిలో పడ్డారు.
రాధే శ్యామ్‌లో ప్రభాస్ (Twitter/Photo)
ఇప్పటికే నాగార్జున తమిళం, తెలుగులో నటించిన ‘ఊపిరి’ సినిమా తమిళ వెర్షన్లో నాగార్జున తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు. ఇక ఇదే సినిమాలో యాక్ట్ చేసిన మరో హీరో కార్తి కూడా తెలుగులో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. కార్తి తెలుగులో డబ్ అయిన ప్రతి సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇక కార్తి రూట్లో వాళ్ల అన్న సూర్య కూడా తెలుగులో రిలీజైన ‘గ్యాంగ్’ డబ్బింగ్ సినిమాలో తన క్యారెక్టర్‌కు తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు. అంతకు ముందు కమల్ హాసన్, రజినీకాంత్..కెరీర్ మొదట్లో తెలుగు,హిందీ వంటి సినిమాల్లో తమ క్యారెక్టర్‌కు తామే డబ్బింగ్ చెప్పుకున్నారు.ఇక మహేష్ బాబు ఫస్ట్ టైమ్..‘స్పైడర్’ తమిళ వెర్షన్లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు.
సలార్ లాంచ్‌లో ప్రభాస్, యష్ Photo : Twitter
తాజాగా కన్నడ స్టార్ హీరో యశ్.. కేజీఎఫ్ 2 కోసం తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. స్వతహాగా యశ్‌కు హిందీలో మంచి పట్టు ఉంది. అందుకే ఇపుడు విడుదల కాబోయే కేజీఎఫ్ 2 కోసం తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పబోతున్నాడట.
కెజియఫ్ 2 రిలీజ్ డేట్ (kgf chapter 2)
త్వరలో తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మొత్తంగా సౌత్ హీరోలందరు మిగతా భాషల్లో ఏదో తమ సినిమాలు విడుదల చేయకుండా.. ఆయా భాషలపై మంచి పట్టు సాధిస్తున్నారనే చెప్పాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.