సాహోతో ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ అవుతారు : కృష్ణం రాజు

Saaho pre release : 'బాహుబలి' చిత్రం తరువాత ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తోన్న ‘సాహో’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రెబల్ స్టార్ కృష్ణం రాజు మాట్లాడారు.

news18-telugu
Updated: August 19, 2019, 10:35 AM IST
సాహోతో ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ అవుతారు : కృష్ణం రాజు
Photo: Twitter
  • Share this:
Saaho pre release : 'బాహుబలి' చిత్రం తరువాత ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తోన్న ‘సాహో’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది.  దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ భారీ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో నిర్వహిస్తోంది చిత్ర బృందం. ఈ సందర్భంగా.. ఈ కార్యక్రమానికి గెస్ట్‌గా వచ్చిన రెబల్ స్టార్ కృష్ణం రాజు మాట్లాడుతూ.. ఈ చిత్రం టీజర్ రిలీజైన తర్వాత ఆహో ఓహో అంటున్నారు. ఇటీవల ట్రైలర్ రిలీజైన తర్వాత అబ్బో అంటున్నారు. అయితే ఆ అబ్బో..ఈ అహోలుఎక్కడి వరకు వెళ్లిందని చెబితే.. ఇవి ఇంటర్నేషనల్ లెవల్‌కు వెళ్లింది. ఈ సినిమాతో ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ అవుతారనే నమ్మకం నాకుందన్నారు కృష్టం రాజు. 

View this post on Instagram
 

It's Showtime! Presenting the theatrical trailer of India's biggest action thriller #Saaho. In cinemas from 30th Aug worldwide. #SaahoTrailerDay #30AugWithSaaho (All Languages Links in Stories) @actorprabhas @shraddhakapoor @sujeethsign @neilnitinmukesh @arunvijayno1 @sharma_murli @evelyn_sharma ‪@maheshmanjrekar ‬@mandirabedi @apnabhidu @chunkypanday @vennelakish @uvcreationsofficial #BhushanKumar @tseriesfilms


A post shared by SAAHO (@officialsaahomovie) on

అయితే ప్రభాస్‌కు నా ఆశీస్సులతో పాటు మీ అందరి ఆశీర్వాదం ఉండాలని కృష్ణం రాజు కోరారు. ఈసినిమా డైరెక్టర్ సుజీత్ చిన్నవాడైన ప్రభాస్‌తో చాలా పెద్ద టాస్క్ పూర్తి చేసాడన్నారు.  ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మందిరా బేడీ, మురళీశర్మ, జాకీ ష్రాఫ్, తిన్ను ఆనంద్, మంజ్రేకర్ మహేష్, లాల్ తదితరులు క్యారెక్టర్‌‌లను రివీల్ చేసింది చిత్ర యూనిట్. యువీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 30న  తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలౌతోంది.
First published: August 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>