వరుణ్ తేజ్.. మెగా కుటుంబం నుంచి వచ్చి తనదైన స్టైల్లో నటిస్తూ కథల ఎంపిక విషయంలో కొత్తదనం చూపిస్తూ టాలీవుడ్లో ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ గని అనే సినిమా చేస్తున్నాడు. బాక్సింగ్ బ్యాగ్ డ్రాప్లో వస్తోన్న ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. వరుణ్ మొదట్లో కథల విషయంలో తడబడ్డ.. ఆ తర్వాత మూస కథలతో వచ్చే సినిమాలను పక్కన పెట్టిన వరుణ్ కొత్తరకం కథలను ఎంచుకోవడం చేయడం మొదలు పెట్టాడు. దీంతో వరుస విజయాలను వరుణ్ సొంతం చేసుకుంటున్నాడు. ఈ చిత్రం కోసం వరుణ్ ప్రత్యేకంగా బాక్సింగ్ శిక్షణ తీసుకున్నాడు. ఈ సినిమా దాదాపు రూ.35 కోట్లతో భారీగా తెరకెక్కుతోంది. వరుణ్‌కు జోడిగా ప్రముఖ హిందీ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తోంది. వరుస చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుందని ప్రకటించింది. ఇప్పటి వరకు బాగానే ఉన్న.. తాజాగా ఈ సినిమాకు ఓ చిక్కోచ్చిపడింది.. ప్రభాస్ భారీ సినిమా కూడా ఇదే రోజు విడుదలకానుందని ప్రకటించింది చిత్రబృందం. ప్రభాస్ పూజా హెగ్డే జంటగా.. రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తోన్న వింటేజ్ లవ్ స్టోరి రాధేశ్యామ్‌కు సంబంధించి తాజాగా ఓ టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే.. ఈ సందర్భంగా రాధేశ్యామ్ టీమ్ తమ సినిమాను జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నామని ప్రకటించింది.
దీంతో ఒకే రోజు రెండు సినిమాలు అంటే ఇటు థియేటర్స్‌కు కష్టమే.. దీంతో పాటు కలెక్షన్స్ కూడా తగ్గుతాయి. దీంతో వరుణ్ తేజ్ గని ఈ విషయంలో ఓ నిర్ణయానికి వస్తున్నాడని సమాచారం. ఇక ప్రభాస్ ‘రాధేశ్యామ్’ కూడా భారీగా వస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్గా చేస్తోంది. దీనికితోడు సాహో సినిమా తర్వాత.. ప్రభాస్ చేస్తోన్న సినిమా ఇది. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. రాధే శ్యామ్ సినిమాను కూడా రూ. 140 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాధే శ్యామ్ సినిమాను రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు.
View this post on Instagram
View this post on Instagram
ఈ సినిమా పాన్ ఇండియా మూవీ.. కాబట్టి ఆ సినిమాతో పోటీ అంటే థియేటర్లు, ఓపెనింగ్స్ అన్నీ కష్టమే అని గని చిత్రబృందం భావిస్తోందట. అందులో భాగంగా ఈ సినిమా విడుదల తేదిని మార్చనున్నారని తెలుస్తోంది. జూలై 2న అడివి శేష్ ‘మేజర్’ రిలీజ్ అవుతోంది. మధ్యలో జూలై 16న మరొక పాన్ ఇండియా చిత్రం ‘కేజీయఫ్ 2’ విడుదల ఉంది. ఈ రెండు సినిమాల మధ్యలో గని సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వరుణ్ తేజ్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన లేటెస్ట్ సినిమా ‘గద్దలకొండ గణేష్’. తమిళ సినిమా జిగర్తాండకు రీమేక్‌గా వచ్చి మంచి విజయం అందుకుంది. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు. గని ఈ సినిమా తర్వాత రావడంతో మంచి హైప్ ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Prabhas, Tollywood Movie News, Varun Tej