Home /News /movies /

PRABHAS UV CREATIONS ENTER INTO WEB SERIES HERE ARE THE DETAILS TA

వెబ్ సిరీస్‌ వైపు అడుగులు వేస్తోన్న ప్రభాస్ నిర్మాతలు..

ప్రభాస్ Photo : Twitter

ప్రభాస్ Photo : Twitter

ప్రస్తుతం కరోనా నేపథ్యంలో గత మూడు నెలలుగా థియేటర్స్ బంద్ అయ్యాయి. దీంతో అప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న చాలా సినిమాలు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదలయ్యాయి. తాజాగా ప్రభాస్ నిర్మాతలు కూడా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.

ఇంకా చదవండి ...
  ప్రస్తుతం కరోనా నేపథ్యంలో గత మూడు నెలలుగా థియేటర్స్ బంద్ అయ్యాయి. దీంతో అప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న చాలా సినిమాలు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదలయ్యాయి. ఒకవేళ కరోనా తగ్గి థియేటర్స్ ఓపెన్ అయినా.. ఇప్పట్లో ప్రజలు టాకీస్‌లు, మల్టీప్లెక్స్‌లకు వెళ్లి సినిమాలు ఇది వరకటిలా సినిమాలు చూస్తారా అనే అనుమానాలున్నాయి. రానున్న కాలంలో ఓటిటి ఫ్లాట్‌ఫామ్స్‌దే హవా. దీంతో చాలా మంది బడా నిర్మాతలు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో అల్లు అరవింద్, సురేష్ బాబు వంటి వారు ఓటీటీ వైపు అడుగులు వేసారు. ఇందులో వచ్చే కంటెంట్‌ సినిమాలను తలదన్నేలా ఉంది. తాజాగా ఈ లిస్టులో ప్రభాస్‌తో ‘మిర్చి’, ‘సాహో’ వంటి సినిమాలను నిర్మించిన యూవీ క్రియేషన్స్ వాళ్లు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లోకి అడుగుపెట్టబోతున్నట్టు తెలుస్తోంది. వీళ్లు ప్రముఖ దర్శకులు పూరీ జగన్నాథ్‌తో పాటు సాహో డైరెక్టర్ సుజిత్‌తో వెబ్ సిరీస్‌లు నిర్మించే ప్లాన్‌లో ఉన్నట్టు సమాచారం.

  prabhas uv creations enter into web series here are the details,prabhas uv creations,Prabhas instagram,prabhas facebook,prabhas twitter,uv creations twitter,uv creations facebook,uv creations instagram,UV Creations,prabhas,UV Creations web series,prabhas web series,saaho,tollywood,telugu cinema,ప్రభాస్,యూవీ క్రియేషన్స్,యూవీ క్రియేషన్స్ ప్రభాస్, యూవీ క్రియేషన్స్ వెబ్ సిరీస్,యూవీ క్రియేషన్స్ సాహో నిర్మాతలు,
  యూవీ క్రియేషన్స్ (Instagram/Photo)


  వీరిద్దరి ఎంట్రీతో ఆయా వెబ్ సిరీస్‌లకు మంచి ఆదరణ ఉంటుంది. హిందీలో ఇప్పటికే అనురాగ్ కశ్యప్, నీరజ్ పాండే వాళ్లు ఇప్పటికే పలు వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్నారు. తెలుగులో పూరీ, సుజిత్ ఎంట్రీ ఇస్తే.. ఆయా వెబ్ సిరీస్‌లకు మరింత ఊపు రావడం ఖాయం.
  First published:

  Tags: Ott, Prabhas, Telugu Cinema, Tollywood, UV Creations, Web Series

  తదుపరి వార్తలు