మరోసారి తన ఆరోగ్యంపై స్పందించిన రెబల్ స్టార్ కృష్ణంరాజు..

కేంద్ర మాజీ మంత్రి నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు (79) మరోసారి స్పందించారు. తాను కొద్ది రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడ్డానని, ఇపుడిపుడే కోలుకుంటున్నానని తెలిపారు.

news18-telugu
Updated: November 21, 2019, 11:51 AM IST
మరోసారి తన ఆరోగ్యంపై స్పందించిన రెబల్ స్టార్ కృష్ణంరాజు..
కృష్ణం రాజు,ప్రభాస్
  • Share this:
కేంద్ర మాజీ మంత్రి నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు (79) మరోసారి స్పందించారు. తాను కొద్ది రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడ్డానని, ఇపుడిపుడే కోలుకుంటున్నానని తెలిపారు. బుధవారం తమ పెళ్లి రోజు సందర్భంగా ఆయన సతీమణి శ్యామలా దేవి బంజారా హిల్స్‌లోని శ్రీ విజయగణపతి  స్వామి దేవాలయంలో శతచండీ మహాయాగంలో పాల్గొన్నారు. అంతేకాదు కృష్ణంరాజు త్వరగా మాములు మనిషికి కావాలని  అక్కడున్న స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత కృష్ణంరాజు.. ఒక లీడింగ్ తెలుగు పత్రికతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇన్ని రోజులు దగ్గు, జ్వరం, జలుబు అందరికీ సాధారణంగా వస్తుంటాయన్నారు. అందులో భాగంగా తనకు కూడా జ్వరం వచ్చింది. తాను ఏదో మందుల కోసమ హాస్పిటల్ వెళితే.. తన ఆరోగ్యం విషమం అన్నట్టు వార్తలు రాసాయని ఆవేదన వ్యక్తం చేసారు. దీంతో అభిమానులు కంగారు పడిపోయి.. తన ఆరోగ్య విషయమై ఆరా తీసారు.  మీడియా కూడా ఒకసారి వార్త రాసేముందు తనను కానీ.. ఇంట్లో వాళ్లను కానీ సంప్రదించి రాస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. తన ఎదుగుదలో మీడియా పాత్ర మరవలేదని కూడా అన్నారు. ఈ సందర్భంగా తాను ఆరోగ్యంగా ఉండాలని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.

First published: November 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...