Prabhas : ప్రభాస్ అరుదైన ఘనత.. ఆసియాలో అత్యంత అందగాడుగా గుర్తింపు..

Prabhas : Twitter

Most Handsome Asian Man : ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరో అరుదైన ఘనత సాధించారు. ప్రభాస్ మోస్ట్ హ్యాండ్సమ్ ఏషియన్ మ్యాన్ 2021 జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు.

  • Share this:
    ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరో అరుదైన ఘనత సాధించారు. ప్రభాస్ మోస్ట్ హ్యాండ్సమ్ ఏషియన్ మ్యాన్ 2021 జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ జాబితాలో రెండువ స్థానంలో పాకిస్థాన్‌కు చెందిన ఇమ్రాన్ అబ్బాస్ నఖ్వీ రాగా.. మూడవ స్థానంలో జపాన్‌కు చెందిన జిన్ అకానిషి ఉన్నారు. ఇక నాల్గవ స్థానంలో దక్షిణ కొరియా స్టార్ కిమ్ హ్యూన్ జోంగ్ 4వ స్థానంలో ఉన్నారు. ఇక ఈ అరుదైన ఫీట్ సాధించిన మొదటి ఇండియన్, సౌత్ ఇండియన్ హీరో ప్రభాస్ కావడం విశేషం. ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సిరీస్ సినిమాలు “బాహుబలి : ది బిగినింగ్” (2015), “బాహుబలి: ది కన్‌క్లూజన్” (2017) సినిమాల ద్వారా వచ్చిన పాపులారిటీతో మరింత క్రేజ్ తెచ్చుకున్నారు.

    మోస్ట్​ హ్యాండ్​సమ్​ ఆసియన్​ మెన్ టాప్-10
    2. ఇమ్రాన్ అబ్బాస్ నఖ్వీ - పాకిస్థాన్‌
    3. జిన్ అకానిషి - జపాన్‌
    4. కిమ్ హ్యూన్ జోంగ్ - దక్షిణ కొరియా
    5. న్హాన్ ఫాక్ విన్ - వియత్నాం
    6. హువాంగ్ జియామింగ్ - చైనా
    7. వివియన్ డీ సేనా - ఇండియా
    8. ఫవాద్ ఖాన్ - పాకిస్తాన్‌
    9. తనవత్ వట్టనాపుటి - థాయిలాండ్
    10. వాలెస్ హువో - తైవాన్
    ఇక ప్రభాస్ నటిస్తున్న ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. ఆయన ఏకంగా నాలుగు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. రాధా కృష్ణ రాధేశ్యామ్‌తో పాటు ప్రశాంత్ నీల్ సలార్, ఓమ్ రౌత్ ఆది పురుష్, ఇక లేటెస్ట్‌గా ప్రారంభమైన నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే. నాగ్ అశ్విన్ ప్రభాస్ కాంబినేషన్‌లో ప్యాన్ వరల్గ్ లెవల్లో వస్తున్న ఈ సినిమాను అశ్వనీదత్ 500 కోట్లకు పైగా భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. మిక్కి జే మేయర్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రాన్ని మేకర్స్ భారీ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. గురు పూర్ణిమా సందర్భంగా ఈ సినిమా ఇటీవల ప్రారంభం అయ్యింది.
    Published by:Suresh Rachamalla
    First published: