ప్రభాస్‌తో త్రివిక్రమ్‌ కొత్త సినిమా.. నిజం ఎంత..

ప్రభాస్ ప్రస్తుతం 'జాన్' సినిమాతో బిజీగా వున్నాడు. ఈ సినిమాను రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ త్రివిక్రమ్‌తో చేయనున్నాడా.. ?

news18-telugu
Updated: January 13, 2020, 1:35 PM IST
ప్రభాస్‌తో త్రివిక్రమ్‌ కొత్త సినిమా.. నిజం ఎంత..
Twitter
  • Share this:
ప్రభాస్ ప్రస్తుతం 'జాన్' సినిమాతో బిజీగా వున్నాడు. ఈ సినిమాను రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. రాధాకృష్ణ గతంలో గోపిచంద్ హీరోగా వచ్చిన జిల్ సినిమాను దర్శకత్వం వహించాడు. సాహో లాంటీ యాక్షన్ సినిమా తర్వాత ప్రభాస్ లవ్‌స్టోరీ చేస్తున్నాడు. జాన్‌లో ప్రభాస్ జోడీగా పూజా హెగ్డే కనిపించనుంది. ఈ సినిమా ఇప్పటికే కొన్ని ముఖ్యమైన సన్నివేశాలకు సంబందించిన షూటింగ్ జరుపుకుంది. అయితే ఈ సినిమా తరువాత ప్రభాస్ ఏ దర్శకుడితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో అల వైకుంఠపురములో‌తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న త్రివిక్రమ్‌తో ప్రభాస్ కొత్త సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ ఇంతకుముందు మహేశ్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి హీరోలతో సినిమాలు తీసిన విషయం తెలిసిందే. అయితే ఇంత వరకూ త్రివిక్రమ్ ప్రభాస్ కాంబినేషనే కుదరలేదు. దీంతో ఈ సారి త్రివిక్రమ్‌తో తన తదుపరి సినిమా ఉండేలా ప్రభాస్ ప్లాన్ చేసుకుంటున్నాడని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. చూడాలి మరి ఈ వార్తలు ఎంతవరకూ కార్యరూపం దాల్చనున్నాయో..
రిచా గంగోపాధ్యాయ్ హాట్ పిక్స్...


First published: January 13, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు