Home /News /movies /

PRABHAS TO WORK WITH SANDEEP REDDY FOR HIS 25TH OFFICIAL STATEMENT RELEASED SR

Prabhas 25 : సందీప్ రెడ్డి దర్శకత్వంలో ప్రభాస్.. అధికారిక ప్రకటన..

Prabhas Sandeep Reddy Vanga Photo : Twitter

Prabhas Sandeep Reddy Vanga Photo : Twitter

Prabhas 25 : గత కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాలో ప్రభాస్ 25 వ సినిమా గురించి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభాస్ స్వయంగా తన సినిమాను ప్రకటించారు. ప్రభాస్ తన 25 వ సినిమా ను అర్జున్ రెడ్డి ఫేమ్ డైరక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేయనున్నారు. ఈ చిత్రానికి స్పిరిట్ అంటూ అప్పుడే టైటిల్‌ను కూడా ప్రకటించారు.

ఇంకా చదవండి ...
    Prabhas | రెబల్ స్టార్ ప్రభాస్ రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో చేసిన ‘బాహుబలి’(Bahubali) సినిమాలతో ఒక్కసారిగా ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఆ సినిమా ఇచ్చిన ఊపుతో ఆయన అన్ని ప్యాన్ ఇండియా సినిమాలనే చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఇప్పటికే ఓ నాలుగు సినిమాలను లైన్’లో పెట్టారు. ఇక తాజాగా ఆయన మరో సినిమాను ప్రకటించారు. గత కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాలో ప్రభాస్ 25 వ సినిమా గురించి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభాస్ స్వయంగా తన సినిమాను ప్రకటించారు. ప్రభాస్ తన 25 వ సినిమా ను అర్జున్ రెడ్డి ఫేమ్ డైరక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేయనున్నారు. ఈ చిత్రానికి స్పిరిట్ అంటూ అప్పుడే టైటిల్‌ను కూడా ప్రకటించారు. ఈ చిత్రాన్ని టీ సీరీస్‌తో కలిసి భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ స్థాయిలో వస్తున్న ఈ ప్యాన్ ఇండియా సినిమా ఏకంగా 8 భాషల్లో విడుదలకానుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

    దర్శకుడు సందీప్ రెడ్డి విషయానికి వస్తే... అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్‌లో సెన్సేషన్ సృష్టించిన సందీప్ రెడ్డి, తన రెండవ సినిమాను హిందీలో కభీర్ సింగ్ అంటూ చేశారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్, ఆది పురుష్, సలార్, ప్రాజెక్ట్ కే చిత్రాలతో ప్రభాస్ బిజిగా ఉన్నారు.



    ప్రభాస్ ప్రస్తుతం సాహో తర్వాత ‘రాధే శ్యామ్’  (Radhe Shyam)అనే సినిమానే చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత ఆయన ఓమ్ రౌత్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాకు ఆదిపురుష్ (Adipurush) అనే పేరును ఖరారు చేశారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటన్నారని టాక్. ఒకవేళా ఇదే నిజమైతే.. భారతీయ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ప్రభాస్ ఒకరని చెప్పవచ్చు.

    Samantha : షూట్ గ్యాప్‌లో తీవ్ర భావోద్వేగానికి గురైన సమంత..

    ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించనున్నారు. కృతి సనన్ సీత పాత్రలో నటిస్తోంది. హిందీ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయక రావణాసురుడి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమా ఆగస్టు 11 2022 న విడుదల కానుందని చిత్రబృందం గతంలో తెలిపింది. ఈ సినిమాను హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది.

    ఇక ఆయన నటిస్తున్న ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్ (Prabhas), నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నారు. గురుపూర్ణిమా సందర్భంగా ఆ మధ్య ప్రాజెక్ట్ K (Project K) అనే భారీ సినిమా మొదలైంది. ఈ సినిమా భారీ సైన్స్ ఫిక్షన్, ఫాంటసి థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా రెగ్యులర్ షెడ్యూల్ వచ్చే నవంబర్ నెల నుంచి మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఇండియాలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్ గా ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, ప్రభాస్‌లు ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు.

    Bheemla Nayak : ఫైనల్ షెడ్యూల్‌లో భీమ్లా నాయక్.. సంక్రాంతి బరిలో ఖాయం..

    ఇక భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ప్రభాస్ అంతే రితీగా డేట్స్ కేటాయించినట్లు తెలిసింది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా 200 రోజలును కేటాయించాడని సమాచారం. ప్రాజెక్ట్ K దాదాపు 90% షూట్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగునుందని తెలుస్తోంది. ఇప్పటికే మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి ప్రత్యేక సెట్లను ఏర్పాటు చేస్తున్నారట. మిక్కి జే మేయర్ సంగీతం అందించనున్నారు.

    ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ మరో రెండు సినిమాలను చేస్తున్నారు. వాటిలో కేజీఎఫ్ దర్శకుడి కాంబినేషన్‌లో అనౌన్స్ చేసిన సలార్‌పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా కన్నడ ఉగ్రమ్ సినిమాకు రీమేక్‌గా వస్తోందని సమాచారం. ఈ చిత్రంలో మళయాళ స్టార్ నటుడు మోహన్ లాల్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

    ఈ సినిమాలతో పాటు ఆయన మరో సినిమాను కూడా స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ తన 24వ సినిమాను హిందీ దర్శకుడు సిద్ధార్ధ్ ఆనంద్‌తో చేయనున్నట్టు సమాచారం. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Prabhas 25 Movie, Sandeep reddy vanga, Tollywood news

    తదుపరి వార్తలు