• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • PRABHAS TO WORK WITH KGF DIRECTOR PRASHANTH NEEL PRODUCED BY MYTHRI MOVIE MAKERS SR

ప్రభాస్‌తో ప్రశాంత్ నీల్.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో..

ప్రభాస్‌తో ప్రశాంత్ నీల్.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో..

ప్రభాస్, ప్రశాంత్ నీల్ Photo : Twitter

ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే.

  • Share this:
    ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. మహానటితో సూపర్ పాపులర్ అయిన నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నాడని తెలిసిందే. దీనికి సంబందించి అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ‘జాన్’ చిత్రం పూర్తవగానే ఈ సినిమా మొదలవుతుంది. నాగ్ అశ్విన్ తన గత చిత్రం ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలు పొందాడు. ప్రభాస్ చిత్రాన్ని కూడా ఆయన అదే స్థాయిలో గొప్పగా తెరకెక్కిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. అది అలా ఉంటే ప్రభాస్ తన తర్వాత సినిమా గురించి మరో వార్త హల్ చల్ చేస్తోంది. 'కేజీఎఫ్'తో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఇంతకు ముందు ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ తోగానీ .. మహేశ్ తోగాని సినిమా చేసే అవకాశం ఉందనే టాక్ వినిపించింది. కానీ ఆ ఇద్దరి నెక్స్ట్ మూవీస్ వేరే దర్శకులతో సెట్ అయింది. దీంతో ప్రశాంత్ నీల్ .. 'కేజీఎఫ్ 2' తరువాత సినిమాను ప్రభాస్ తో చేయాలనే నిర్ణయానికి వచ్చాడని అంటున్నారు. అంతేకాదు ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ ప్రశాంత్ నీల్‌కు కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చారట. దీనితో ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబినేషన్ ఓ సినిమా దాదాపు ఖాయం కావచ్చు అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు