ఇద్దరు భామలతో రొమాన్స్ చేయనున్న ప్రభాస్..

'సాహో' లాంటీ భారీ యాక్షన్ సినిమా తర్వాత ప్రభాస్‌ ఓ లవ్ స్టోరితో రాబోతున్న విషయం తెలిసిందే.

news18-telugu
Updated: December 5, 2019, 12:11 PM IST
ఇద్దరు భామలతో రొమాన్స్ చేయనున్న ప్రభాస్..
ప్రభాస్
  • Share this:
'సాహో' లాంటీ భారీ యాక్షన్ సినిమా తర్వాత ప్రభాస్‌ ఓ లవ్ స్టోరితో రాబోతున్న విషయం తెలిసిందే. గోపిచంద్ హీరోగా 'జిల్' అనే సినిమా తీసిన డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ఈ చిత్రం చేస్తున్నాడు. వింటేజ్‌ లవ్‌స్టోరిగా వస్తోన్న ఈ సినిమాలో ప్రభాస్ ఇద్దరితో రొమాన్స్ చేయనున్నాడని టాక్. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుంది. ఇప్పటికే  ప్రభాస్‌ సరసన పూజా హెగ్డే నటిస్తోండగా..  తాజా సమాచారం ప్రకారం ఇందులో పూజా హెగ్డేతో పాటు కాజల్‌ కూడా నటించనున్నారట. కాజల్‌ ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. పునర్జన్మల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలోని కీలక సన్నివేశాల్లో ప్రభాస్‌ సరసన కాజల్‌ కనిపిస్తారని సమాచారం. దీనిపై ఇంకా చిత్రబృందం నుంచి అధికారి ప్రకటన వెలువడలేదు.  అది అలా ఉంటే ప్రభాస్, కాజల్‌ జోడీకి టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉంది. వీరిద్దరు కాంబినేషన్‌లో వచ్చిన ‘డార్లింగ్’, ‘మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌’ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాయి.
View this post on Instagram

Not so mellow-yellow🌟🌟🌟


A post shared by Pooja Hegde (@hegdepooja) on

అదిరిన రాధిక ఆప్టే లేటెస్ట్ పిక్స్..
Published by: Suresh Rachamalla
First published: December 5, 2019, 11:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading