ప్రభాస్‌తో రొమాన్స్‌కు దీపిక పదుకొనే సై.. ఇదిగో సాక్ష్యం..

Prabhas Deepika Padukone: ప్రభాస్ అంటే ఇప్పుడు తెలుగు హీరో కాదు. ఈయన కోసం బాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా వేచి చూస్తున్నారు. సాహో సినిమా కూడా హిందీలో మంచి వసూళ్లే తీసుకురావడంతో..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 31, 2020, 5:53 PM IST
ప్రభాస్‌తో రొమాన్స్‌కు దీపిక పదుకొనే సై.. ఇదిగో సాక్ష్యం..
ప్రభాస్ సినిమాలో దీపిక పదుకొనే (prabhas deepika padukone)
  • Share this:
ప్రభాస్ అంటే ఇప్పుడు తెలుగు హీరో కాదు. ఈయన కోసం బాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా వేచి చూస్తున్నారు. సాహో సినిమా కూడా హిందీలో మంచి వసూళ్లే తీసుకురావడంతో ఈయనపై అంచనాలు కూడా పెరిగిపోతున్నాయి. అందుకే ప్రభాస్ సినిమా అంటే ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలలో కూడా ఆసక్తి పెరిగిపోతుంది. ప్రస్తుతం ఈయన రాధాకృష్ణ కుమార్ సినిమాతో పాటు నాగ్ అశ్విన్ సినిమాకు కూడా కమిట్ అయ్యాడు. ఈ రెండు సినిమాల్లో ముందు రాధా సినిమాను పూర్తి చేయనున్నాడు ప్రభాస్. ఈ చిత్ర షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. లాక్‌డౌన్ పూర్తైన తర్వాత తిరిగి షూటింగ్ మొదలు కానుంది.
ప్రభాస్ సినిమాలో దీపిక పదుకొనే (prabhas deepika padukone)
ప్రభాస్ సినిమాలో దీపిక పదుకొనే (prabhas deepika padukone)


ఇదిలా ఉంటే నాగ్ అశ్విన్ సినిమాలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించబోతుందని ప్రచారం జరుగుతుంది. అలియా భట్ పేరు వినిపించినా కూడా ఇప్పుడు దీపిక పేరు ఫైనల్ అయినట్లు తెలుస్తుంది. దానికి సాక్ష్యం కూడా లేకపోలేదు. తాజాగా ఈమె తన ఇన్‌స్టా పేజీలో మహానటి సినిమాపై ప్రశంసల వర్షం కురిపించింది. అంతా ఆ సినిమాను చూడాలంటూ తన అభిమానులను కూడా కోరింది. కారణం లేకుండా సౌత్ సినిమా పొగడాల్సిన అవసరం దీపికకు లేదు.. ఆ సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్‌తోనే ప్రభాస్ సినిమా చేయబోతున్నాడు.
ప్రభాస్ సినిమాలో దీపిక పదుకొనే (prabhas deepika padukone)
ప్రభాస్ సినిమాలో దీపిక పదుకొనే (prabhas deepika padukone)

ఈ చిత్రంలో హీరోయిన్‌గా దీపికను అడగటంతోనే మహానటి ఆమె చూసి వర్క్ నచ్చి అతడితో పని చేయడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఎలాగూ సినిమా నచ్చింది కాబట్టి ప్రమోట్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో అతీత శక్తులున్న వాడిగా ప్రభాస్ నటించబోతున్నాడు. దేవకన్యకు, మానవుడికి పుట్టిన బిడ్డగా ప్రభాస్ పాత్ర ఉంటుందని తెలుస్తుంది. చూస్తుంటే జగదేకవీరుడు అతిలోకసుందరి సీక్వెల్‌లా అనిపిస్తుంది కదా.. అందరికీ ఇదే అనుమానం. అయితే ఇప్పటి వరకు దీనిపై క్లారిటీ మాత్రం రాలేదు.
Published by: Praveen Kumar Vadla
First published: May 31, 2020, 5:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading