Saaho: ‘సాహో’ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ఇదే.. ?

‘బాహుబలి’ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ‘సాహో’. సుజిత్ దర్శకత్వంలో దాదాపు రూ.330 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 30న తెలుగుతో పాటు హిందీ, తమిళం,మలయాళంలో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ చేయబోయే క్యారెక్టర్ ఇదే నంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.

news18-telugu
Updated: August 24, 2019, 1:12 PM IST
Saaho: ‘సాహో’ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ఇదే.. ?
ప్రభాస్ సాహో (Source: Twitter)
news18-telugu
Updated: August 24, 2019, 1:12 PM IST
‘బాహుబలి’ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ‘సాహో’. సుజిత్ దర్శకత్వంలో దాదాపు రూ.330 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 30న తెలుగుతో పాటు హిందీ, తమిళం,మలయాళంలో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా సెన్సార్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్.. అండర్ కవర్ కాప్‌గా నటించబోతున్నట్టు సమాచారం. అంతేకాదు ఆయన క్యారెక్టర్ పేరు అశోక చక్రవర్తి అని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్.. రెండు పాత్రల్లో డ్యూయల్ రోల్లో కనిపించనున్నట్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి ఇందులో వాస్తమెంతో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇతర ముఖ్యపాత్రల్లో జాకీ ఫ్రాఫ్,నీత్ నితిన్ ముఖేష్,చుంకీ పాండే,మందిరా బేడి,అరుణ్ విజయ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు.

 

First published: August 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...