తాము సంపాదిస్తోన్న డబ్బులను ఒక్కో విధంగా ఖర్చు చేస్తుంటారు సినీ సెలబ్రిటీలు. అయితే కొంతమంది మాత్రం తాము నివసించే ఫ్లాట్లకు కోట్లు పెట్టి కొంటుంటారు. అలా భారతీయ సినీ సెలబ్రిటీల్లో కాస్ట్లీ ఇల్లు కలిగిన టాప్ 5 నటులు ఎవరంటే.
తాము సంపాదిస్తోన్న డబ్బులను ఒక్కో విధంగా ఖర్చు చేస్తుంటారు సినీ సెలబ్రిటీలు. అయితే కొంతమంది మాత్రం తాము నివసించే ఫ్లాట్లకు కోట్లు పెట్టి కొంటుంటారు. అలా భారతీయ సినీ సెలబ్రిటీల్లో కాస్ట్లీ ఇల్లు కలిగిన టాప్ 5 నటులు ఎవరంటే.
బాలీవుడ్ గ్రీక్ వీరుడుగా పేరొందిన హృతిక్ రోషన్ ఇటీవల ముంబైలో రెండు ఫ్లాట్లను కొన్నట్లు వార్తలు వచ్చాయి. సముద్రం వ్యూ కనిపించేలా ఈ నటుడు పక్కపక్కనే ఉన్న రెండు అపార్ట్మెంట్లను కొన్నట్లు సమాచారం. వాటి కోసం దాదాపుగా ఈ నటుడు వంద కోట్లు వెచ్చించినట్లు సమాచారం. అంతేకాదు అందులో తన ఇద్దరు పిల్లలకు అన్ని సౌకర్యాలు ఉండేలా మార్పులు చేసుకున్నట్లు కూడా టాక్.
ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న అనుష్క శర్మ.. ఆమె భర్త, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇద్దరికి ఇప్పటికే ముంబయిలో ఒక ఫ్లాట్ ఉంది. అయితే ఈ జంట ఢిల్లీలోని గుర్గావ్లో ఓ ఫ్లాట్‌ని కొనుగోలు చేశారని.. దాని ఖరీదు రూ.80కోట్లు ఉండనుందని సమాచారం.
బాహుబలితో అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించుకున్న టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు భారత్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు వరుస సినిమాలను ప్రకటించిన ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నారు. కాగా హైదరాబాద్‌లో ప్రభాస్‌కి కాస్ట్లీ ఇల్లు ఉండగా., దాని ఖరీదు దాదాపు రూ.60కోట్లని సమాచారం.
బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న షాహిద్ కపూర్, తన కుటుంబానికి ముంబయిలో రూ.56కోట్లు విలువ చేసే ఒక విశాలమైన డూప్లెక్స్ ఇల్లు ఉన్నట్లు సమాచారం.
బాలీవుడ్లో గత కొన్నేళ్లుగా బిజీ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న అలియా భట్.. ముంబయిలోని బాంద్రా ఏరియాలో ఇటీవల రూ.32కోట్లు పెట్టి ఫ్లాట్‌ని కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇక అదే బిల్డింగ్‌లో అలియా లవర్ రణ్‌బీర్ కపూర్ ఇల్లు కూడా ఉన్నట్లు టాక్.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.