Prabhas | రెబల్ స్టార్ ప్రభాస్ రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో చేసిన ‘బాహుబలి’(Bahubali) సినిమాలతో ఒక్కసారిగా ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఆ సినిమా ఇచ్చిన ఊపుతో ఆయన అన్ని ప్యాన్ ఇండియా సినిమాలనే చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఇప్పటికే ఓ నాలుగు సినిమాలను లైన్’లో పెట్టారు. ఇక తాజాగా ప్రభాస్ మరో సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ 25 వ సినిమా గురించి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆయనే స్వయంగా తన సినిమాను సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ప్రభాస్ తన 25 వ సినిమా ను అర్జున్ రెడ్డి ఫేమ్ డైరక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేయనున్నారు. ఈ చిత్రానికి స్పిరిట్ అంటూ అప్పుడే టైటిల్‌ను కూడా ప్రకటించారు. అయితే టైటిల్ లోగోను బట్టి ఈ సినిమాలో పోలీసుల గురించి చర్చించనున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్ పోలీసు పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. చూడాలి మరి ఈ రూమర్స్‌లో నిజం ఎంతో..
ఇక ఈ చిత్రాన్ని టీ సీరీస్‌తో కలిసి భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ స్థాయిలో వస్తున్న ఈ ప్యాన్ ఇండియా సినిమా ఏకంగా 8 భాషల్లో విడుదలకానుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
The Mighty man marching On.....?#Prabhas25SandeepReddyVanga#BhushanKumar#Prabhas @VangaPranay #KrishanKumar @TSeries @VangaPictures pic.twitter.com/gbkfh6suLn
— Sandeep Reddy Vanga (@imvangasandeep) October 7, 2021
దర్శకుడు సందీప్ రెడ్డి సినీ కెరీర్ విషయానికి వస్తే... అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్లో సెన్సేషన్ సృష్టించిన సందీప్ రెడ్డి, తన రెండవ సినిమాను హిందీలో కభీర్ సింగ్ అంటూ చేశారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి యానిమల్ అనే సినిమాను చేస్తున్నారు. రణ్ బీర్ కపూర్ హీరోగా చేస్తున్నారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్, ఆది పురుష్, సలార్, ప్రాజెక్ట్ కే చిత్రాలతో ప్రభాస్ బిజీగా ఉన్నారు.
ప్రభాస్ ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ (Radhe Shyam)అనే సినిమానే చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత ఆయన ఓమ్ రౌత్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాకు ఆదిపురుష్ (Adipurush) అనే పేరును ఖరారు చేశారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటన్నారని టాక్. ఒకవేళా ఇదే నిజమైతే.. భారతీయ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ప్రభాస్ ఒకరని చెప్పవచ్చు.
ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించనున్నారు. కృతి సనన్ సీత పాత్రలో నటిస్తోంది. హిందీ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయక రావణాసురుడి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమా ఆగస్టు 11 2022 న విడుదల కానుందని చిత్రబృందం గతంలో తెలిపింది. ఈ సినిమాను హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది.
ఇక ఆయన నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్ (Prabhas), నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ K (Project K) అనే భారీ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా భారీ సైన్స్ ఫిక్షన్, ఫాంటసి థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా రెగ్యులర్ షెడ్యూల్ వచ్చే నవంబర్ నెల నుంచి మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఇండియాలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్ గా ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, ప్రభాస్‌లు ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. మిక్కి జే మేయర్ సంగీతం అందించనున్నారు.
ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ మరో రెండు సినిమాలను చేస్తున్నారు. వాటిలో కేజీఎఫ్ దర్శకుడి కాంబినేషన్లో అనౌన్స్ చేసిన సలార్‌పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా చేస్తోంది. ఈ సినిమా కన్నడ ఉగ్రమ్ సినిమాకు రీమేక్‌గా వస్తోందని సమాచారం. ఈ చిత్రంలో మళయాళ స్టార్ నటుడు మోహన్ లాల్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలతో పాటు ఆయన మరో సినిమాను కూడా స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ తన 24వ సినిమాను హిందీ దర్శకుడు సిద్ధార్ధ్ ఆనంద్‌తో చేయనున్నట్టు సమాచారం. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Prabhas, Tollywood news