బాహుబలి తర్వాత ప్రభాస్ సరసన నటించడానికి హీరోయిన్లు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఈయన రేంజ్ కూడా పెరిగిపోయింది. అందుకే ప్రభాస్ కోసం బాలీవుడ్.. కుదిరితే హాలీవుడ్ నుంచి హీరోయిన్లను దించుతున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు ఈయన సాహో సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇందులో కూడా తెలుగు హీరోయిన్ కాకుండా బాలీవుడ్ బ్యూటీని తీసుకొచ్చారు నిర్మాతలు. శ్రద్ధా కపూర్ ఈ చిత్రంతోనే తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. ఇక దీంతో పాటు నటిస్తున్న రాధాకృష్ణ కుమార్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్.
ఇదిలా ఉంటే ఇప్పుడు సాహో సినిమాలో ప్రభాస్ జోడీగా మరో హీరోయిన్ కూడా నటిస్తుంది. తెలుగుతో పాటు ఈ చిత్రాన్ని తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఆగస్ట్ 15న విడుదల కానుంది సాహో. ఇప్పటికే షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. ఇక ఈ చిత్రం కోసం హాలీవుడ్ టెక్నికల్ టీం పని చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు సుజీత్.
ప్రభాస్ కోసం ఈ చిత్రంలో బ్రిటీష్ నటి కైలీ మినోగ్ వస్తుంది. ఈమె ఓ ప్రత్యేక గీతంలో నటించబోతుంది. ఇండియన్ సినిమాల్లో ఇదివరకే కనిపించింది కైలీ. అక్షయ్ కుమార్ బ్లూ సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు ఏడేళ్ల తర్వాత ప్రభాస్ సాహోలో నటిస్తుంది ఈ బ్యూటీ. మొత్తానికి ప్రభాస్ కోసం ఫారెన్ బ్యూటీని తీసుకొస్తున్నారు దర్శక నిర్మాతలు. మరి ఈ పాట సినిమాలో ఎలా ఉండబోతుందో..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Prabhas, Shraddha Kapoor, Telugu Cinema, Tollywood