నిఖిల్‌ను బయటకు తోసేసిన ప్రభాస్.. ఇంతకీ ఏం జరిగిందంటే..

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్యాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్న ప్రభాస..తాజాగా నిఖిల్‌ను నిర్ధాక్షిణ్యంగా బయటకు నెట్టడం ఏమిటి అనుకుంటున్నారా ? వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: February 6, 2020, 11:53 AM IST
నిఖిల్‌ను బయటకు తోసేసిన ప్రభాస్.. ఇంతకీ ఏం జరిగిందంటే..
ప్రభాస్,నిఖిల్ (Twitter/Photo)
  • Share this:
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కృష్ణంరాజు నట వారసుడిగా ఈశ్వర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రభాస్.. ఆ తర్వాత అంచలంచెలుగా తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో చేసిన బాహుబలి సినిమాలతో హీరోగా ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ప్యాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇలాంటి ట్రాక్ రికార్డుతో దూసుకుపోతున్న ప్రభాస్.. నిఖిల్‌ను నిర్ధాక్షిణ్యంగా బయటకు నెట్టడం ఏమిటి అనుకుంటున్నారా ? వివరాల్లోకి వెళితే.. తాాజగా సోషల్ మీడియాలో కొంత మంది నెటిజన్స్.. ప్రభాస్ పేరు మీద టాలీవుడ్ సింగిల్స్ అడ్డా అనే గ్రూప్ క్రియేట్ చేసారు. అందులో ప్రభాస్‌తో పాటు రానా, అడివి శేష్,అనుష్క,కాజల్, తమన్నా, శర్వానంద్, విజయ్ దేవరకొండలతో పాటు నిఖిల్ కూడా ఉన్నాడు.

ఐతే.. రీసెంట్‌గా నికిల్.. డాక్టర్ పల్లవి వర్మ అనే అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ జరిగింది. అంతేకాదు తనకు కాబోయే భార్యతో నిఖిల్ దిగిన ఫోటోను విజయ్ దేవరకొండ తమ గ్రూప్‌లో పోస్ట్ చేసినట్టు క్రియేట్ చేసాడు. అది చూసి గ్రూప్ అడ్మిన్ అయిన ప్రభాస్..  వెంటనే నిఖిల్‌ను ఆ టాలీవుడ్ సింగిల్స్ అడ్డా గ్రూప్ నుండి తొలిగించనట్టు ఫోటో ఉంది.  సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్న ఈ పిక్ చూసిన హీరో నిఖిల్.. దానిని రీ ట్వీట్ చేస్తూ.. ఎంతో సరదగా పడిపడి  నవ్వుతున్న ఎమోజీలను పోస్ట్ చేసారు. దీనిపై నెటిజన్స్ ఎంతో ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.
First published: February 6, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు