హోమ్ /వార్తలు /సినిమా /

Prabhas: శృతి హాసన్‌కి ప్రభాస్ స్పెషల్ ట్రీట్.. అమ్మడి ఫీలింగ్స్ చూస్తే!

Prabhas: శృతి హాసన్‌కి ప్రభాస్ స్పెషల్ ట్రీట్.. అమ్మడి ఫీలింగ్స్ చూస్తే!

ప్రభాస్, శృతి హాసన్

ప్రభాస్, శృతి హాసన్

ప్రభాస్‌ చేస్తున్న కొత్త సినిమా సలార్.ఈ సినిమాలో ప్రభాస్ హీరోయిన్‌గా శృతిహాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సందర్భంగా శృతి హాసన్ ఓ వీడియోను ఇన్ స్టాలో పోస్టు చేసింది.

టాలీవుడ్​ మిస్టర్​ పర్​ఫెక్ట్, బాహుబలి ప్రభాస్​‌( Prabhas) ను పరిచయం చేయాల్సిన పనిలేదు. అతడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్ర‌భాస్ రేంజ్‌ గురించి.. అతడి మంచి మనసు గురించి.. అతడు గెస్టులకు ఇచ్చే విలువ అందరికీ తెలిసిందే. ఆయ‌న‌తో కలిసి పనిచేసిన ఎంతోమంది కో స్టార్స్.. ప్రభాస్ ఆతిథ్యానికి ఫిదా అవుతుంటారు. ప్రభాస్(Prabhas) ఇంటి నుంచి తెప్పించే ఫుడ్‌ను బాహుబ‌లి మీల్స్(Bahubali Meals) అని సరదాగా నటులు అంతా చెబుతుంటారు. సినిమాలతోనే కాకుండా తనతో షూటింగ్​లో పాల్గొనే కోస్టార్స్​కు సైతం విందు భోజనం ప్రేమగా వడ్డిస్తాడు ప్రభాస్. ప్రభాస్​ ఎక్కడా సినిమా చేసినా తన వంటమనిషితో వండించుకుని తినడం అలవాటు. తనే కాకుండా కోస్టార్స్​కు కూడా ఇంటిరుచులను రుచిచూపిస్తాడు. ఎంతోమంది హీరోయిన్లకు కూడా ఆ ఫుడ్ టెస్ట్ చూపించాడు. ఇప్పటికే ఎంతోమంది బాలీవుడ్ ప్రముఖులు, హీరోయిన్లు ఈ ఫుడ్ టెస్ట్ చేశారు. తాజాగా శృతిహాసన్(Shruti Haasan) సైతం ప్రభాస్ ఫుడ్‌కు పడిపోయింది.

ప్రస్తుతం ప్రభాస్​ కేజీఎఫ్(KGF) డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌(Prashanth Neel)తో కలిసి 'సలార్'(Salaar) సినిమా చేస్తున్నాడు. మరోవైపు 'ప్రాజెక్ట్​ కె' సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్నాడు. తాజాగా సలార్ షూటింగ్ సెట్స్‌లో ప్రభాస్ ఫుడ్‌కు సంబంధించిన వీడియోను శృతిహాసన్(Shruthi Haasan) తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. థాంక్యూ ప్రభాస్ అంటూ.. ప్రభాస్ ఇంటి ఫుడ్‌కు సంబంధించిన నోరూరించి వంటకాల వీడియోలను షేర్ చేసింది. ఇందులో నాన్ వెజ్ వంటకాలు కూడా ఉన్నాయి. ఇక ఈ వీడియో బ్యాంక్ గ్రౌండ్‌లో ప్రభాస్ ఆడియో కూడా వస్తుంది. ఎల్లుండి మటన్,కోడి కూడా వస్తుందంటూ ప్రభాస్ చెబుతున్నారు. గతంలో శ్రద్ధాకపూర్‌, కృతిసనన్‌, పూజాహెగ్డే, శ్రుతిహాసన్‌, కరీనాకపూర్‌,దిశా పఠాని‌లు కూడా ప్రభాస్‌ విందు, ఆయనిచ్చే ఆతిథ్యం గురించి స్పెషల్‌గా సోషల్ మీడియాలో ప్రస్తావించిన విషయం తెలిసిందే.

ప్రభాస్(Prabhas) తన సినిమా షూటింగ్ టైం లో ప్రతి ఒక్కరిని ఎంత జాగ్రత్తగా ప్రేమగా ట్రీట్ చేస్తుంటాడు. ఇప్పుడు సలార్ ఈ లేటెస్ట్ షెడ్యూల్ లో కూడా సెట్స్ లో ఉండే వారు అందరికీ తన తన ప్రేమతో అదరిపోయే ఫుడ్ ట్రీట్ అందిస్తున్నాడు. ప్రతి రోజు కూడా అందరికీ తానే ఆహారం తెప్పిస్తూ వారికి వడ్డిస్తున్నాడు. ప్రభాస్ మంచి ఫుడీ అని అందరికీ తెలిసిందే. తాను తినడం కన్నా ప్రేమగా ఇతరులకు పెట్టడం ప్రభాస్ కి ఎంతో ఇష్టం ఇప్పుడు ఇలాగే సలార్ సెట్స్ లో నడుస్తుండగా ఒక హ్యాపీ మూమెంట్ ని హీరోయిన్ శృతి హాసన్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చెయ్యగా అది ఇప్పుడు మంచి వైరల్ అవుతుంది.

First published:

Tags: Prabhas, Prashanth Neel, Salaar, Shruthi haasan

ఉత్తమ కథలు