PRABHAS SISTER PRASEEDA ENTERING TELUGU FILM INDUSTRY AS A PRODUCER SR
ప్రభాస్ సోదరి సినీ రంగ ప్రవేశం.. అదిరిన కాంబినేషన్..
కృష్ణం రాజు, ప్రసీదతో ప్రభాస్ Photo : Twitter
Prabhas : కృష్ణంరాజు పెద్ద కుమార్తె ప్రసీద ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేయబోతున్నారు. రాధేశ్యామ్ నిర్మాణంలో పాలుపంచుకుంటూ.. నిర్మాతగా ఆమె అడుగుపెట్టనున్నారు.
సీనియర్ నటుడు రెబల్ స్టార్ కృష్ణం రాజు తన మాస్ అప్పీల్.. డైలాగ్ డెలివరీతో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఆయన వారసుడిగా వచ్చిన ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి, యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో వచ్చిన సాహో లాంటీ సినిమాలతో జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యాడు. ఆయన ప్రస్తుతం రాధేశ్యామ్ అనే ఓ పిరియాడిక్ రొమాంటిక్ లవ్ స్టోరి చేస్తున్నాడు. దీనికి సంబందించిన ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. UV బ్యానర్‌తో కలిసి గోపికృష్ణ బ్యానర్‌పై కృష్ణం రాజునిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమాతో కృష్ణం రాజు కుటుంబం నుంచి మరొకరు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కృష్ణంరాజు పెద్ద కుమార్తె ప్రసీద ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేయబోతున్నారు. ఈ రాధేశ్యామ్ నిర్మాణంలో పాలుపంచుకుంటూ..ఈ సినిమాకు నిర్మాతగా ఆమె అడుగుపెట్టనున్నారు. ఈ సినిమా నిర్మాతల్లో వంశీ, ప్రమోద్ తో పాటు ప్రసీద కూడా ఉన్నారు. అంతేకాదు ప్రసీద పాపులర్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌కు సినిమాలను, వెబ్ సిరీస్‌లను నిర్మించనుందట. అయితే ఈ విషయంలో ప్రభాస్ తన సోదరికి పూర్తి సహకారాన్ని అందిస్తున్నాడట.
ఇక ప్రభాస్ రాధేశ్యామ్ తర్వాత మహానటితో పాపులరైనా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ జానర్లో ఓ సినిమా చేయనున్నాడు. దాదాపు 250 కోట్లతో భారీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనుల్నీ జరుపుకుంటోంది.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.