Prabhas - Saneep Reddy Vanga : ఆ ముగ్గురు స్టార్ హీరోలకు నచ్చలేదు.. కానీ ప్రభాస్‌కు తెగ నచ్చేసింది..

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా (Prabhas Sandeep Reddy Vanga Photo : Twitter)

Prabhas - Saneep Reddy Vanga : ఆ ముగ్గురు స్టార్ హీరోలకు నచ్చలేదు.. కానీ ప్రభాస్‌కు తెగ నచ్చేసింది.. అవును సందీప్ రెడ్డి చెప్పిన స్క్రిప్ట్ ముందుగా ప్రభాస్‌కు కాకుండా ఆ ముగ్గురు స్టార్ హీరోలకు చెప్పాడట.

  • Share this:
    Prabhas - Saneep Reddy Vanga : ఆ ముగ్గురు స్టార్ హీరోలకు నచ్చలేదు.. కానీ ప్రభాస్‌కు తెగ నచ్చేసింది.. అవును సందీప్ రెడ్డి చెప్పిన స్క్రిప్ట్ ముందుగా ప్రభాస్‌కు కాకుండా ఆ ముగ్గురు స్టార్ హీరోలకు చెప్పాడట. వివరాల్లోకి వెళితే.. రెబల్ స్టార్ ప్రభాస్ రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో చేసిన ‘బాహుబలి’(Bahubali) సినిమాలతో ఒక్కసారిగా ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఆ సినిమా ఇచ్చిన ఊపుతో ఆయన అన్ని ప్యాన్ ఇండియా సినిమాలనే చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఇప్పటికే ఓ నాలుగు సినిమాలను లైన్’లో పెట్టారు. ఇక తాజాగా ప్రభాస్ మరో సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ 25 వ సినిమా గురించి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆయనే స్వయంగా తన సినిమాను సోషల్ మీడియా వేదికగా  ప్రకటించారు.

    ప్రభాస్ తన 25 వ సినిమా ను అర్జున్ రెడ్డి ఫేమ్ డైరక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేయనున్నారు. ఈ చిత్రానికి స్పిరిట్ అంటూ అప్పుడే టైటిల్‌ను కూడా ప్రకటించారు. అయితే టైటిల్‌ లోగోను బట్టి ఈ సినిమాలో పోలీసుల గురించి చర్చించనున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్ పోలీసు పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ముందుగా సందీప్ రెడ్డి ఈ స్టోరీని మహేష్ బాబుకు వినిపించారట. ముందుగా మహేష్ బాబు ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. ఆ తర్వాత చేయనని చెప్పాడట. ఆ తర్వాత అల్లు అర్జున్‌కు వినిపించాడట. అంతకు ముందు అర్జున్ రెడ్డి సినిమాను సందీప్ రెడ్డి బన్నితో తెరకెక్కిద్దామనుకున్నాడు. కానీ అతను రిజెక్ట్ చేయడం.. విజయ్ దేవరకొండ చేయడం.. ఓవర్ నైట్ స్టార్ హీరో అవ్వడం జరిగిపోయింది.

    చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ బాటలో స్మాల్ స్క్రీన్ పై బాలకృష్ణ సందడి..

    అటు ఈ సినిమా స్టోరీని మహేష్ బాబు, అల్లు అర్జున్ తర్వాత రామ్ చరణ్‌కు వెళ్లి వినిపించాడట. కానీ రామ్ చరణ్ ఈ సినిమా స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేయమని కోరాడట. కానీ సందీప్ రెడ్డి వాటికి ఒప్పుకోలేదు. దీంతో చెర్రీలో ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ కాలేదు. కానీ సందీప్ రెడ్డి చెప్పిన కథకు ప్రభాస్ ఫస్ట్ సిట్టింగ్‌లోనే ఓకే చేసేసాడట. దీంతో వీళ్లిద్దరి కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లింది.

    Venkatesh : ఆర్తి అగర్వాల్ సహా వెంకటేష్ టాలీవుడ్‌కు పరిచయం చేసిన భామలు వీళ్లే..

    ఇక ఈ చిత్రాన్ని టీ సీరీస్‌తో కలిసి భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ స్థాయిలో వస్తున్న ఈ ప్యాన్ ఇండియా సినిమా ఏకంగా 8 భాషల్లో విడుదలకానుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. మరోవైపు ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధే శ్యామ్’ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. మరోవైపు ఆదిపురుష్.. పంద్రాగష్టు కానుకగా రిలీజ్ కానుంది. ఇంకోవైపు ప్రశాంత్ నీల్‌తో సలార్, నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ K సినిమాలతో ప్రభాస్ ఫుల్లు బిజీగా ఉన్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: