• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • PRABHAS SALAAR UPDATE SEEMS LIKE PRABHAS WILL BE SEEN IN DOUBLE ROLE IN SALAAR HERE ARE THE DETAILS SR

Prabhas Salaar : ప్రభాస్ అభిమానులకు మరో గుడ్ న్యూస్.. ఫ్యాన్స్‌కు పండగే..

Prabhas Salaar : ప్రభాస్ అభిమానులకు మరో గుడ్ న్యూస్.. ఫ్యాన్స్‌కు పండగే..

సలార్‌లో ప్రభాస్ Photo : Twitter

Prabhas Salaar : రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం సలార్.

  • Share this:
    రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం సలార్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం తెలంగాణలోని గోదావరి ఖనిలో జరుగుతోంది. రవితేజ క్రాక్‌తో సూపర్ హిట్ అందుకున్న శృతి హాసన్ ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా చేస్తోంది. ఇక ఈ సినిమాను కేజీయఫ్‌ ఛాప్టర్‌ 1తో ప్యాన్‌ ఇండియా డైరెక్టర్‌గా క్రేజ్‌ దక్కించుకున్న ప్రశాంత్ నీల్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక 'సలార్‌' కోసం ప్రభాస్‌ నాలుగు నెలల సమయం కేటాయించాడని సమాచారం. అది అలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ డబుల్ రోల్’లో కనిపించనున్నాడని తెలుస్తోంది. దీనికి ఓ రీజన్ కూడా చెబుతున్నారు ఆయన అభిమానులు. సలార్ షూటింగ్ మొదలు పెట్టిన రోజు నుంచి ప్రభాస్ లుక్స్ బయటకు లీక్ అవుతున్నాయి. టైటిల్ విడుదల సమయంలో ప్రభాస్ లుక్.. ఇప్పుడు షూటింగ్ సమయంలో లీక్స్ రూపంలో బయటకు వస్తోన్న లుక్స్’లో ప్రభాస్ భిన్నంగా కనపడుతున్నాడు. దీంతో ప్రభాస్ ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపించనున్నాడని అంటున్నారు. ఇక మరికొందరేమో.. అదేం ఉందడు.. బహుశా టూ షేడ్స్ ఉండి ఉండోచ్చు అని అంటున్నారు. దీనిపై కొంత క్లారిటీ రావాల్సిఉంది. ఈ సినిమాను కూడా కేజీఎఫ్ నిర్మాతలే నిర్మించనున్నారు. ప్రభాస్ ఈ సినిమాలో అతి క్రూరుడిగా కనిపించచనున్నాడు.

    ఇక ఈ సినిమా పూర్తవ్వగానే ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఆదిపురుష్ రెండు రోజుల కింద ప్రారంభం అయ్యింది.








    View this post on Instagram






    A post shared by Prabhas (@actorprabhas)





    ప్రభాస్ ప్రస్తుతం సలార్ షూటింగ్‌లో పాల్గోంటున్నాడు. ఆ సినిమా పూర్తవ్వగానే ఈ సినిమా  రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గోననున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించనున్నాడు. సీత పాత్రలో కొన్నాళ్లు కీర్తి సురేష్ నటిస్తుందని టాక్ నడిచింది. ఆ తర్వాత ఊర్వశీ రౌటేలా అన్నారు. కాగా తాజా సమాచారం మేరకు మన టాలీవుడ్ లోకి సూపర్ స్టార్ మహేష్ తో ఎంట్రీ ఇచ్చిన టాల్ హీరోయిన్ కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుందని తెలుస్తోంది. ఈమెనే ప్రభాస్ కు సరసన మేకర్స్ ఫిక్స్ చేసినట్టు బాలీవుడ్ వర్గాలలో గట్టిగా వినిపిస్తున్న టాక్. మరి దీనిపై అధికారిక సమాచారం విడుదలకావాల్సి ఉంది. ఇక లక్ష్మనుడి పాత్రలో టైగర్ ష్రాఫ నటించనున్నాడని టాక్. అంతేకాదు హేమా మాలినీ కూడా ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో కనిపించనుందని సమాచారం.








    View this post on Instagram






    A post shared by Prabhas (@actorprabhas)





    ఈ రెండు సినిమాలో పాటు ప్రభాస్ మరో సినిమా కూడా చేస్తున్నాడు. మహానటి సినిమాతో పాపులరైనా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకునే నటిస్తుండగా.. హిందీ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మరో కీలకపాత్రలో నటించనున్నాడు. ఈ సినిమాను అశ్వనీ దత్ నిర్మిస్తున్నాడు.
    Published by:Suresh Rachamalla
    First published: