• HOME
 • »
 • NEWS
 • »
 • MOVIES
 • »
 • PRABHAS SALAAR UPDATE MADHU GURUSWAMY TO PLAY ANTAGONIST IN PRABHAS AND PRASHANTH NEEL SALAAR HERE ARE THE DETAILS SR

Prabhas Salaar : సలార్‌లో ప్రభాస్‌తో తలపడేది అతనే.. వైరల్ అవుతోన్న సోషల్ మీడియా పోస్ట్..

Prabhas Salaar : సలార్‌లో ప్రభాస్‌తో తలపడేది అతనే.. వైరల్ అవుతోన్న సోషల్ మీడియా పోస్ట్..

సలార్‌లో ప్రభాస్ Photo : Twitter

Prabhas Salaar : రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం సలార్.

 • Share this:
  రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం సలార్. ఈ చిత్రం ప్రస్తుతం తెలంగాణలోని గోదావరి ఖనిలో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రభాస్‌కు జోడిగా శృతి హాసన్ నటిస్తోంది. భారీ యాక్షన్ ఫిల్మ్‌గా వస్తోన్న ఈ సినిమాలో విలన్‌గా ఎవరు చేస్తున్నారు.. అని ఓ పెద్ద టాక్. కాగా దీనిపై క్లారిటీ వచ్చింది. ఈ క్రమంలో తాను ‘సలార్‌’లో నటిస్తున్నానని పేర్కొంటూ కన్నడ నటుడు మధు గురుస్వామి సోషల్‌మీడియాలో తాజాగా పోస్ట్‌ పెట్టాడు. ఆయన తన పోస్ట్‌లో రాస్తూ.. ‘నా తదుపరి సినిమా ప్రభాస్ ‘సలార్‌’. నాకెంతో ఆనందాన్ని అందిస్తున్న ఈ విషయం గురించి మీతో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ‘సలార్‌’ వంటి అద్భుతమైన ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు ఆనందిస్తున్నాను. నాకు ఇలాంటి సువర్ణ అవకాశాన్ని అందించిన దర్శకుడు ప్రశాంత్‌నీల్‌కు ధన్యవాదాలు అంటూ రాసుకున్నాడు. మధు గురుస్వామి చేసిన ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు ఇక ఈ సినిమాలో ప్రభాస్‌ను ఎదుర్కోనేది ఇతనే అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. దీనిపై కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక్కడ ఇంకో విషయం ఏమంటే.. తమిళ నటుడు విజయ్ సేతుపతి పేరు కూడా వినిపించింది. సలార్‌లో ప్రభాస్‌కు పోటీగా ప్రశాంత్ నీల్‌ విజయ్ సేతుపతిని దించనున్నాడని టాక్ నడిచింది. దీంతో బహుశా ఈ సినిమాలో ఇద్దరు విలన్స్ ఉంటారేమో అని అనుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.

  ఇక ఈ సినిమాను కేజీయఫ్ నిర్మించిన హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. 'సలార్‌' కోసం ప్రభాస్‌ నాలుగు నెలల సమయం కేటాయిస్తున్నాడని సమాచారం. ఈ భారీ పాన్ ఇండియన్ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ పక్కా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నాడట.
  View this post on Instagram


  A post shared by Prabhas (@actorprabhas)

  అంతే కాకుండా పవర్ ఫుల్ బ్యాక్ డ్రాప్ ను కూడా ఎంచుకొన్నాడని తెలుస్తుంది. కొంత సోషల్ కాన్సెప్ట్‌తో సామాన్యుల హక్కుల పోరాడే ఒక పవర్ ఫుల్ అండర్ వరల్డ్ డాన్ పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడట. ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులకు సైతం విపరీతంగా అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం లేకపోలేదు.
  View this post on Instagram


  A post shared by Prabhas (@actorprabhas)

  బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ ‌తో ఓ ఖతర్నాక్ దర్శకుడు తోడవ్వడం సినిమా మరింత క్రేజ్‌ను పెంచింది. దేశవ్యాప్తంగా కేజీయఫ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలియంది కాదు. ఆ సినిమాలో సెంటిమెంట్స్ కానీ, హీరో ఎలివేషన్స్ కానీ, యాక్షన్ సీక్వెన్స్‌లు గానీ.. ఓ రేంజ్‌లో ఉంటాయి. ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో ఓ ప్యాన్ ఇండియా సినిమా అంటే ఓ రేంజ్‌లో ఊహించుకుంటున్నారు.  ఈ సినిమాలో ప్రభాస్ అతి క్రూరుడిగా కనిపించచనున్నాడట. ఇది పూర్తి కాగానే హిందీ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్‌ సినిమా షూటింగ్‌లో పాల్గోన్ననున్నాడు. ఈ సినిమాకు బాటీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించనున్నాడు. ఇక ఈ సినిమాలో సీత పాత్రలో కొన్నాళ్లు కీర్తి సురేష్ నటిస్తుందని టాక్ నడిచింది. ఆ తర్వాత ఊర్వశీ రౌటేలా అన్నారు. కాగా తాజా సమాచారం మేరకు మన టాలీవుడ్ లోకి సూపర్ స్టార్ మహేష్ తో ఎంట్రీ ఇచ్చిన టాల్ హీరోయిన్ కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుందని తెలుస్తోంది.
  View this post on Instagram


  A post shared by Prabhas (@actorprabhas)

  ఈమెనే ప్రభాస్ కు సరసన మేకర్స్ ఫిక్స్ చేసినట్టు బాలీవుడ్ వర్గాలలో గట్టిగా వినిపిస్తున్న టాక్. ఆదిపురుష్ షూటింగ్ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ లేని సీన్స్‌ను షూట్ చేస్తున్నాడట దర్శకుడు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ మరో ప్యాన్ ఇండియా సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపికా పదుకునే నటిస్తోండగా.. అమితాబ్ బచ్చన్ మరో కీలకపాత్రలో కనిపించనున్నాడు. మిక్కి జే మేయర్ సంగీతాన్ని అందించనున్నాడు.
  Published by:Suresh Rachamalla
  First published:

  అగ్ర కథనాలు