రెబెల్‌స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సలార్. రీసెంట్గా ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి నుండి చిత్రీకరణను జరుపుకోనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇది వరకు సలార్ సినిమా కోసం బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహంను సంప్రదించారని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు మరో స్టార్ హీరోను సలార్‌లో విలన్‌గా నటింప చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ స్టార్ ఎవరో కాదు.. కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి. విజయ్ సేతుపతి ఉంటే తెలుగుతో పాటు తమిళంలోనూ మార్కెట్ ఉంటుంది. విజయ్ సేతుపతి ఇప్పుడు చేస్తున్న హిందీ సినిమాలు విడుదలై ఉంటాయి కాబట్టి, సలార్ విడుదల సమయంలో విజయ్ సేతుపతి గురించి బాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు.
కాబట్టి విజయ్ సేతుపతిని ఈ సినిమాలో నటింప చేయడానికి గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. జూలైలోపు సలార్ షూటింగ్‌ను పూర్తి చేయాలనేది ప్రభాస్ ఆలోచనగా కనిపిస్తోంది. దీంతో పాటు ఓంరావుత్ దర్శకత్వంలో ఆదిపురుష్ షూటింగ్‌ను కూడా ప్రభాస్ స్టార్ట్ చేయబోతున్నాడు.
అలాగే సలార్ హీరో ప్రభాస్ ఒకవైపు తన రాధేశ్యామ్ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అలాగే ప్రశాంత్ నీల్.. కేజీయఫ్ ఛాప్టర్ 2 సినిమాను పూర్తి చేసేశాడు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేస్తూనే సలార్ షూటింగ్‌ను స్టార్ట్ చేస్తాడు ప్రశాంత్ నీల్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Prabhas, Salaar, Vijay Sethupathi