• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • PRABHAS SALAAR MOVIE UPDATES KGF GIRL SRINIDHI SHETTY TO DANCE WITH REBEL STAR IN SPECIAL SONG MNJ

Prabhas Salaar: ప్ర‌భాస్ స‌లార్ మూవీలో స్పెష‌ల్ సాంగ్‌లో మెర‌వ‌నున్న‌ది ఆ బ్యూటీనేనా

Prabhas Salaar: ప్ర‌భాస్ స‌లార్ మూవీలో స్పెష‌ల్ సాంగ్‌లో మెర‌వ‌నున్న‌ది ఆ బ్యూటీనేనా

ప్రభాస్ (Twitter/Photo)

Prabhas Salaar: ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ సలార్. ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. పాన్ ఇండియన్ స్థాయిలో అన్ని భాషలలో సలార్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాను అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచే స‌లార్‌పై అభిమానుల్లో అంచ‌నాలు ఓ రేంజ్‌లో ఏర్పడ్డాయి.

  • Share this:
    Prabhas Salaar: ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ సలార్. ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. పాన్ ఇండియన్ స్థాయిలో అన్ని భాషలలో సలార్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాను అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచే స‌లార్‌పై అభిమానుల్లో అంచ‌నాలు ఓ రేంజ్‌లో ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్‌ని శ‌ర‌వేగంగా జ‌రుపుతున్నారు ప్ర‌శాంత్ నీల్. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌నుకుంటున్న ప్ర‌శాంత్ నీల్.. అందుకు త‌గ్గ‌ట్లుగా ప‌క్కా ప్ర‌ణాళిక‌తో షూటింగ్‌ని కానిచ్చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇందులో హీరోయిన్‌గా అందాల బ్యూటీ శ్రుతీ హాస‌న్ న‌టిస్తున్నారు. ఇందులో ఆమె పాత్ర కూడా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉండ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ మూవీలో ఒక స్పెష‌ల్ సాంగ్ ఉండ‌నుంద‌ట‌.

    ఇందులో శ్రీనిధి శెట్టి న‌టించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. కేజీఎఫ్ రెండు భాగాల్లో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టించింది. ఇప్పుడు విక్ర‌మ్ కోబ్రా మూవీలోనూ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇక తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ బ్యూటీకి ప్ర‌భాస్ స‌లార్ మూవీలో స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించే అవ‌కాశం వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్నప్పటికీ.. తనకు మంచి హిట్ ఇచ్చిన ప్రశాంత్ కోరిక మేరకు ఈ పాటలో నటించేందుకు ఆమె కూడా ఒప్పుకున్న‌ట్లు టాక్.




    ఇదిలా ఉంటే మ‌రోవైపు ప్ర‌భాస్, ఓమ్ రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ఆది పురుష్‌లో న‌టిస్తున్నారు. ఇందులో రాముడి పాత్ర‌లో ప్ర‌భాస్ న‌టిస్తున్నారు. 3డీలో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో కృతి స‌న‌న్ సీత‌గా, సైఫ్ అలీ ఖాన్ రావ‌ణాసురుడిగా క‌నిపించ‌నున్నారు. ఇక ఈ రెండు మూవీల‌ను పూర్తి చేసుకున్న త‌రువాత నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ ఓ సైన్స్ ఫిక్ష‌న్ చిత్రంలో న‌టించ‌నున్నారు. ఇందులో దీపికా ప‌దుకొనే హీరోయిన్‌గా న‌టించ‌నుంది. అలాగే అమితాబ్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఇక రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
    Published by:Manjula S
    First published:

    అగ్ర కథనాలు