Home /News /movies /

PRABHAS SALAAR MOVIE UPDATE SALAAR NEW SCHEDULE SHOOTING WILL START ON MAY FIRST WEEK SB

Prabhas: వచ్చేనెల సెట్స్‌పైకి సలార్.. హైదారబాద్‌లో షూటింగ్

ప్రభాస్  Prabhas  Salaar Photo : Twitter)

ప్రభాస్ Prabhas Salaar Photo : Twitter)

సలార్” చిత్రంలో అత్యధిక సంఖ్యలో యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయని చెబుతున్నారు. వచ్చేనెల.. మే ఫస్ట్ వీక్ లోనే శ్రుతి హాసన్ తో కలిసి ఆయన రంగంలోకి దిగబోతున్నాడని అంటున్నారు.

    KFG చాప్టర్ 2 హై సక్సెస్ తర్వాత, మేకర్స్ మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్- “సలార్” పై దృష్టి పెట్టారు. ఈ సినిమాలో బాహుబలి స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటించనున్నారు. KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ “సలార్” (Salaar)చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - శృతి హాసన్ జంటగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ సలార్. గత ఏడాదే సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం..దాదాపు నలబై శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. మిగిలిన పార్ట్ ను కూడా త్వరత్వరగా ఫినిష్ చేయాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారట. రీసెంట్ గా కెజిఎఫ్ 2 మూవీ విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడమే కాదు ..నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ బ్రేక్ చేసింది. దీంతో సలార్(Salaar) మూవీ ఫై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.

    ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు కొత్త షెడ్యూల్ ను మే మొదటి వారం నుంచి హైదరాబాద్‌లో ప్రారంభించబోతున్నారట. అందుకు ప్రభాస్(Prabhas) సైతం గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడని తెలుస్తోంది, వచ్చేనెల.. మే ఫస్ట్ వీక్ లోనే శ్రుతి హాసన్ తో కలిసి ఆయన రంగంలోకి దిగబోతున్నాడని అంటున్నారు. ఇక ఈ షెడ్యూల్ కంటిన్యూగా జరిపి టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ మూవీ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

    అంతేకాదు “సలార్” చిత్రంలో అత్యధిక సంఖ్యలో యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ కి ముందు సముద్రంపై జరిగే ఛేజింగ్ సీక్వెన్స్ సినిమాకు హైలెట్‌గా ఉంటుందట. సముద్రం లోపల జరిగే ఫైట్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయని అంటున్నారు. ఈ ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కోసం సలార్ టీమ్ దాదాపు 20 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని టాక్. ఇక ఈ (Salaar) సినిమా రెండు భాగాలుగా వస్తున్నట్లు మరోటాక్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. అనేక అంచనాల మధ్య రూపొందుతున్న ‘సలార్’లో ప్రభాస్ డైనమిక్ రోల్‌లో కనిపించనున్నాడు. “రాధేశ్యామ్”తో అభిమానులను నిరాశపరిచిన ప్రభాస్ “సలార్”తో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని డిసైడ్ అయ్యారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Prabhas, Prashanth Neel, Salaar, Salaar movie

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు