Home /News /movies /

PRABHAS SALAAR MOVIE TITLE MIM MAJLIS PARTY CHIEF ASADUDDIN OWAISI THANKS PRABHAS SALAR TITLE HERE ARE THE DETAILS TA

Prabhas-Owaisi: ప్రభాస్‌ ‘సలార్’ టైటిల్ విషయంలో ఎంఐఎం ఛీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఖుషీ..

ప్రభాస్, అసదుద్దీన్ ఓవైసీ (File/Photo)

ప్రభాస్, అసదుద్దీన్ ఓవైసీ (File/Photo)

Prabhas_MIM Chief Asaduddin Owaisi | రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా టైటిల్ ‘సలార్’ విషయంలో ఎంఐఎం ఛీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఒకటే ఖుషీ అవుతున్నాడు. వివారల్లోకి వెళితే.. 

  Prabhas_MIM Chief Asaduddin Owaisi | రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా టైటిల్ ‘సలార్’ విషయంలో ఎంఐఎం ఛీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఒకటే ఖుషీ అవుతున్నాడు. వివారల్లోకి వెళితే..  ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత రెబల్ స్టార్.. ‘సాహో’ తో పలకరించాడు. ఈ సినిమా దక్షిణాది ప్రేక్షకులను మెప్పించలేకపోయినా.. నార్త్‌ ఆడియన్స్ మాత్రం ప్రభాస్ నటనకు ఫిదా అయ్యారు. ఈ సినిమా తర్వాత రాధా కృష్ణ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ సినిమా చేస్తోన్న ప్రభాస.. ఆ వెంట వెంటనే పలు క్రేజీ ప్రాజెక్టలను లైన్‌లో పెట్టాడు. అందులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్నాడు. మరోవైపు తానాజీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను రామాయణ గాథ ఆధారంగా ఓంరౌత్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరామచంద్రుడిగా నటిస్తున్నాడు. మరోవైపు సీతగా ఈ సినిమాలో కృతి సనన్ పేరు దాదాపు ఖరారైంది. ఈ చిత్రంలో దశరథుడిగా రెబల్ స్టార్ కృష్ణంరాజు నటిస్తున్నట్టు సమాచారం. తాజాగా ప్రభాస్ .. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్ మూవీని నిర్మిస్తున్న బ్యానర్‌లో ‘సలార్’ అనే ప్యాన్ ఇండియా మూవీ అనౌన్స్ చేసాడు.

  ప్రభాస్ నుంచి ఒకదాన్ని మించి మరొకటి పవర్ ఫుల్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేస్తూ ఇండియన్ బాక్సాఫీస్ కు తన దమ్ము ఏంటో ఓ రేంజ్ లో చూపించేందుకు సన్నద్ధం అవుతున్నాడు. ఇక లేటెస్ట్‌గా ప్రకటించిన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ “సలార్”పై భారీ ఎత్తున అంచనాలు ఏర్పడ్డాయి. ఈ కాంబినేషన్ విషయంలో గత కొంత కాలం నుంచి వినిపిస్తోన్న రూమర్స్‌ను నిజం చేస్తూ.. ప్రకటన రావడంతో అభిమానులు ఓ రేంజ్‌లో సంతోషపడుతున్నారు. అందులో భాగంగా సెన్సేషనల్ కాంబో ప్రశాంత్ నీల్ తో ప్రకటన రావడంతో తారా స్థాయి అంచనాలు నెలకొన్నాయి. వీటికి తోడు తాజాగా విడుదలైన పోస్టర్ అండ్ టైటిల్ కూడా మాంచి థ్రిల్లింగ్‌ కు గురిచేస్తోంది. ఇక అప్పుడే ఈ సినిమా స్టోరిపై రకరకాల కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా ‘సలార్’ టైటిల్  అంటే ఏంటో అనే దానిపై ఆసక్తి నెలకొంది.

  ఫ్రభాస్ ‘సలార్’ మూవీ (Twitter


  ‘సలార్’ అనే ఏంటో అని నెటిజన్లు గూగుల్‌లో వెతకడం మొదలుపెట్టారు. ప్రభాస్ తన ప్రతి చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తుండంతో ఈ సినిమాకు కూడా అన్ని భాషల్లో ఒకే టైటిల్ ఉండేలా ‘సలార్’ అనే ఉర్దూ పదాన్ని టైటిల్‌గా పెట్టారు. ‘సలార్’ అంటే ధైర్యవంతుడనే అర్ధం ఉంది. అంతేకాదు బలమైన నాయకుడు అనే అర్ధం కూడా ఉంది. టైటిల్ పోస్టర్ మీద హింసాత్మకమైన వ్యక్తులు ఒక మనిషిని హింసాత్మకమైన వ్యక్తి అని పిలుస్తుంటారు. అతనే ‘సలార్’ అంటూ టైటిల్ ఎంత పవర్‌పుల్ అనేది చెప్పారు. ఈ టైటిల్ పై ఎంఐఎం ఛీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆనందం వ్యక్తం చేస్తున్నారట.

  ప్రభాస్, అసదుద్దీన్ ఓవైసీ (File/Photo)


  పాతబస్తీలో ఎంఐఎం పాగా వేయడంతో అసదుద్దున్ ఓవైసీ తండ్రి సలావుద్దీన్ ఓవైసీ పాత్ర ఎంతో ఉంది. ఆయనను అక్కడి ప్రజలు సలార్ అని గౌరవంగా పిలుస్తారు. ఇక ప్రభాస్ టైటిల్ కూడా ‘సలార్’ టైటిల్ కావడంతో అసదుద్దిన్ ఓవైసీతో పాటు ఎంఐఎం శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా పాతబస్తీ నాయకుడైన సలావుద్దీన్‌ను మరోసారి గుర్తు చేసినందకు ప్రభాస్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈయన 1984 నుంచి 1999 వరకు వరుసగా ఆరుసార్లు హైదరాబాద్ ఎంపీగా ఎన్నికయ్యారు.

  ’సలార్’ గా ప్రభాస్ (Twitter/Photo)


  ఆ సంగతి పక్కన పెడితే..   ఈ భారీ పాన్ ఇండియన్ చిత్రం ‘సలార్’ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ పక్కా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నాడట. అంతే కాకుండా పవర్ ఫుల్ బ్యాక్ డ్రాప్ ను కూడా ఎంచుకొన్నాడని తెలుస్తుంది. కొంత సోషల్ కాన్సెప్ట్‌తో సామాన్యుల హక్కుల పోరాడే ఒక పవర్ ఫుల్ అండర్ వరల్డ్ డాన్ పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడట.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Asaduddin Owaisi, MIM, Prabhas, Prashanth Neel, Salaar, Sandalwood, Tollywood

  తదుపరి వార్తలు