Home /News /movies /

PRABHAS SALAAR MOVIE PRITHVIRAJ SUKUMARAN PLAY CRUCIAL VILLAIN ROLE IN PRASHANTH NEEL SALAAR MOVIE SAYS RADHE SHYAM HERO PRABHAS TA

Prabhas - Salaar : ప్రభాస్ సలార్‌లో భీమ్లా నాయక్ హీరో.. కన్ఫామ్ చేసిన రెబల్ స్టార్..

ప్రభాస్  Prabhas  Salaar Photo : Twitter)

ప్రభాస్ Prabhas Salaar Photo : Twitter)

Prabhas - Salaar - Prithviraj Sukumaran : రెబల్‌స్టార్‌ ప్రభాస్‌   హీరోగా కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ప్యాన్ ఇండియా చిత్రం సలార్. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా శృతి హాసన్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో భీమ్లా నాయక్ హీరో నటిస్తున్నట్టు ప్రభాస్ కన్ఫామ్ చేసారు.

ఇంకా చదవండి ...
    Prabhas - Salaar - Prithviraj Sukumaran : రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ (Prabhas)  హీరోగా కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ప్యాన్ ఇండియా చిత్రం  (Salaar) సలార్. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా (Shruti Haasan) శృతి హాసన్ నటిస్తున్నారు. ఈ సినిమా 'ఉగ్రమ్' కన్నడ చిత్రానికి రీమేక్​ అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాలసిఉంది. ఇక ఈ (Salaar) సినిమాను కేజీయఫ్ నిర్మించిన హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇక ఈ  (Salaar) సినిమా రెండు భాగాలుగా వస్తున్నట్లు మరోటాక్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈసినిమా విషయంలో మరో రూమర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమా (Salaar) ఓటీటీ రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లు పోటీ పడుతున్నాయని అంటున్నారు. అందులో భాగంగా అన్ని భాషల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం రూ. 200 కోట్లకు పైగా ఆఫర్ వచ్చిందట.

    ఈ సినిమాలో విలన్‌గా మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించబోతున్నట్టు గత కొన్నేళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయమై ప్రభాస్... మాట్లాడుతూ.. ఈ సినిమాలో పృథ్వీరాజ్ నటిస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు.  ఇక పృథ్వీ రాజ్ నటిస్తే.. ఈ సినిమాకు మలయాళ మార్కెట్‌లో వచ్చే ఇంపాక్ట్ వేరే లెవల్లో ఉంటుంది. ఇక ప్రభాస్ ‘సలార్’లో విలన్‌ పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఉంది. పృథ్వీరాజ్  యాక్ట్ చేస్తుండంతో  మలయాళంలో ఈ సినిమా రేంజ్ మారిపోవడం ఖాయం అంటున్నారు. అందుకే భారీ పారితోషకంతో పాటు కథ కూడా నచ్చడంతో పృథ్వీరాజ్ కూడా ‘సలార్’ మూవీలో విలన్‌గా యాక్ట్  చేయడానికి ఓకే చెప్పారు. ఈయన ‘భీమ్లా నాయక్’ ఒరిజినల్ వెర్షన్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాలో కోషియన్ పాత్రలో నటించారు. ఈ క్యారెక్టర్ ను తెలుగులో రానా చేసిన సంగతి తెలిసిందే కదా.

    Prabhas - Prithviraj Sukumaran Will Play Crucial Villain Role in Prashanth Neel Salaar Movie,Prabhas - Prithviraj Sukumaran : ప్రభాస్ ‘సలార్’లో విలన్‌గా మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్..,Prabhas,Prithviraj Sukumaran,Prabhas Prithviraj Sukumaran,Prithviraj Sukumaran Villain Role In Prabhas Salaar Movie,Prabhas Romance With Meenakshi Chaudhary,Meenakshi Chaudhary,Prabhas Double Role in Salaar Movie,Vaani Kapoor,Vaani Kapoor Romance With Prabhas,Prabhas Salaar,Prabhas Salaar Next Schedule,prabhas,Salaar,Prabhas Salaar Movie Amazon Prime 100 Crore Offer,prabhas salaar movie,prabhas salaar movie story,prabhas salaar movie story revealed prashanth neel,prashanth neel prabhas movie,salaar movie story backdrop revealed,ప్రభాస్,సలార్ సినిమా బ్యాక్‌డ్రాప్,ప్రభాస్ ప్రశాంత్ నీల్ సలార్ సినిమా,100 కోట్లకు సలార్ డిజిటల్ హక్కులు, సలార్ మూవీకి అమెజాన్ ప్రైమ్ నుంచి రూ 100 కోట్ల డీల్,ప్రభాస్ సలార్ నెక్ట్స్ షెడ్యూల్,ప్రభాస్ సలార్‌లో డ్యూయల్ రోల్,ప్రభాస్ ద్విపాత్రాభినయం,ప్రభాస్‌తో రొమాన్స్ చేయనున్న వాణీ కపూర్,వాణీ కపూర్,మీనాక్షి చౌదరి,రవితేజ సరసన మీనాక్షి చౌదరి,సలార్ మూవీ,సలార్ మూవీలో విలన్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్,పృథ్వీ రాజ్ సుకుమారన్
    ప్రభాస్,పృథ్వీరాజ్ సుకుమారన్ (Twitter/Photo)


    ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ’సలార్’ ఈ చిత్రం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ కి ముందు సముద్రంపై జరిగే ఛేజింగ్ సీక్వెన్స్ సినిమాకు హైలెట్‌గా ఉంటుందట. సముద్రం లోపల జరిగే ఫైట్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయని అంటున్నారు. ఈ ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కోసం సలార్ టీమ్ దాదాపు రూ.  20 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని టాక్.

    Radhe Shyam : ప్రభాస్ ’రాధే శ్యామ్’ సహా సినీ ఇండస్ట్రీలో పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు ఇవే..

    ఇక ఈ (Salaar) సినిమా కథ విషయానికి వస్తే.. కొంత సోషల్ కాన్సెప్ట్‌తో సామాన్యుల హక్కుల పోరాడే ఒక పవర్ ఫుల్ అండర్ వరల్డ్ డాన్ పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారట. ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులకు సైతం విపరీతంగా అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం లేకపోలేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ (Prabhas) ‌తో ఓ ఖతర్నాక్ దర్శకుడు తోడవ్వడం సినిమా మరింత క్రేజ్‌ను పెంచింది. దేశవ్యాప్తంగా కేజీయఫ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలియంది కాదు. ఆ సినిమాలో సెంటిమెంట్స్ కానీ, హీరో ఎలివేషన్స్ కానీ, యాక్షన్ సీక్వెన్స్‌లు గానీ.. ఓ రేంజ్‌లో ఉంటాయి. ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో ఓ ప్యాన్ ఇండియా సినిమా అంటే ఓ రేంజ్‌లో ఊహించుకుంటున్నారు.

    prabhas,prabhas twitter,prabhas instagram,prabhas chatrapathi movie,prabhas chatrapathi movie shooting scenes,prabhas chatrapathi movie action scenes,prabhas chatrapathi movie supeet hits with a stick,prabhas chatrapathi movie art director ravindar reddy,telugu cinema,ప్రభాస్,ప్రభాస్‌ను నిజమైన కర్రతో కొట్టిన విలన్,ప్రభాస్ ఛత్రపతి షూటింగ్,ప్రభాస్ <a href='https://telugu.news18.com/tag/radhe-shyam/'><h5 class=రాధే శ్యామ్ ప్రమోషన్స్" width="1600" height="1600" /> ‘సలార్’లో ప్రభాస్ (Twitter/Photo)


    ఇక ప్రభాస్ (Prabhas) నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. హిందీ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్‌ అనే సినిమా కంప్లటైంది. ఈ సినిమాను 2023 సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించనున్నారు. కృతి సనన్ సీత పాత్రలో కనిపించనున్నారు. హిందీ సూపర్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో లంకేశ్‌గా న‌టిస్తున్నారు.  పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోనన ఈ సినిమా ఇటు హిందీతో పాటు, తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ, క‌న్న‌డ‌ భాష‌ల్లో విడుదలకానుంది. ఈ సినిమాను భూష‌ణ్ కుమార్ (టీ సిరీస్), ప్ర‌సాద్ సుతార్‌, రాజేశ్ నాయ‌ర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

    Alia Bhatt - Samantha : ఆలియా భట్, సమంత సహా హాలీవుడ్ బాట పడుతున్న భారతీయ స్టార్స్..

    ప్రభాస్ (Prabhas) ఈ చిత్రంతో పాటు ప్రస్తుతం (Radhe Shyam) రాధే శ్యామ్‌ అనే సినిమాలో నటించారు. ఈ చిత్రానికి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఇదే కాక బాలీవుడ్ నటి దీపికా పదుకొనేతో కలిసి ప్రభాస్ ‘ప్రాజెక్ట్ K’ పేరుతో ఓ సినిమా చేస్తున్నారు.  మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bollywood news, Prabhas, Prithviraj Sukumaran, Salaar, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు