PRABHAS SALAAR MOVIE PHOTOS LEAK ON SOCIAL MEDIA SB
Salaar: సలార్ నుంచి ప్రభాస్ ఫోటోలు లీక్.. సోషల్ మీడియాలో వైరల్
ప్రభాస్ Prabhas Salaar Photo : Twitter)
సలార్ సినిమా షూటింగ్ నడుస్తోన్న విషయం తెలిసిందే. ఇందలో హీరోగా రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నాడు. అయితే సలార్ షూటింగ్లో ఉన్న ప్రభాస్ ఫోటోలు లీక్ అయ్యాయి.
బాహుబలి స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ప్యాన్ ఇండియా చిత్రం (Salaar) సలార్. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. ‘కేజీఎఫ్ 2’ ప్రచార కార్యక్రమాల కోసం ప్రశాంత్ నీల్ ‘సలార్’ షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు ప్రభాస్ సినిమా పనులను తిరిగి మొదలుపెట్టారు. ఈ సినిమా బ్యాలెన్స్ షూట్‌ను మే తొలివారంలో హైదరాబాద్‌లో ప్రారంభించనున్నారని సమాచారం.
ఈ షెడ్యూల్లో టాకీపార్ట్ మొత్తం కంప్లీట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఫుల్ యాక్షన్ సీన్లతో ఉంటుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సలార్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. సలార్ నుంచి ప్రభాస్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. దీంతో ఇప్పుడు ప్రభాస్ అభిమానులు వాటిని వైరల్ చేస్తున్నారు. ఆన్లైన్లో లీక్ కావడంతో ప్రభాస్ అభిమానులు వాటిని షేర్ చేస్తున్నారు.
తాజాగా సలార్ మూవీ నుంచి లీక్ అయిన ఫోటోలలో ఒకదానిలో ప్రభాస్ ఒక యాక్షన్ సీక్వెన్స్ కోసం సిద్ధంగా ఉన్నాడు. టీం ఆయనను టేక్ కోసం సిద్ధం చేయడంలో సహాయపడుతుంది. మరొకదానిలో ప్రభాస్ తన చుట్టూ ఉన్న కొంతమంది స్పాట్ బాయ్స్‌తో సినిమా సెట్‌పై సాధారణంగా నడుస్తూ కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా (Shruti Haasan) శృతి హాసన్ నటిస్తున్నారు. ఈ సినిమా 'ఉగ్రమ్' కన్నడ చిత్రానికి రీమేక్ అంటున్నారు. దీనిపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇక ఈ (Salaar) సినిమాను కేజీయఫ్ నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది.
ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ కి ముందు సముద్రంపై జరిగే ఛేజింగ్ సీక్వెన్స్ సినిమాకు హైలెట్‌గా ఉంటుందట. సముద్రం లోపల జరిగే ఫైట్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయని అంటున్నారు. ఈ ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కోసం సలార్ టీమ్ దాదాపు 20 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని టాక్. ఇక ఈ (Salaar) సినిమా రెండు భాగాలుగా వస్తున్నట్లు మరోటాక్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ సలార్‌తో పాటు ఆదిపురుష్ సినిమా కూడా చేస్తున్న విషయం తెలిసిందే.
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ అనే సినిమా చేస్తున్నారు. హీరోయిన్గా కృతి సనన్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించనున్నారు. కృతి సనన్ సీత పాత్రలో కనిపించనున్నారు. హిందీ సూపర్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో లంకేశ్‌గా నటిస్తున్నారు. ఆదిపురుష్‌ను ఇటు హిందీతో పాటు, తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలకానుంది.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.