Prabhas Salaar Launch : ప్రభాస్ ప్యాన్ ఇండియా మూవీ సలార్ ప్రారంభం.. అతిథిగా యష్..

సలార్ లాంచ్‌‌లో ప్రభాస్, యష్ Photo : Twitter

Prabhas Salaar Launch : రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం సలార్.

  • Share this:
    రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం సలార్. ఈ సినిమా లాంచనంగా ఈరోజు హైదరాబాద్‌లో ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమానికి కేజీయఫ్ హీరో యష్ కూడా హాజరైయాడు. ఇక ఇప్పటికే ప్రభాస్ తన ప్యాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ షూటింగ్ ముగియడంతో అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుందని సమాచారం. కేజీయఫ్‌ ఛాప్టర్‌ 1తో ప్యాన్‌ ఇండియా డైరెక్టర్‌గా క్రేజ్‌ దక్కించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్‌.. ఇప్పుడు కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2ను భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. ఓ పక్క కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2 పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి అవుతుండగానే ప్రశాంత్‌ నీల్‌, ప్రభాస్‌తో చేయబోతున్న 'సలార్‌' సినిమాను ప్రారంభించాడు. ఇక 'సలార్‌' కోసం ప్రభాస్‌ నాలుగు నెలల సమయం కేటాయిస్తున్నాడని సమాచారం. ఇది పూర్తి కాగానే హిందీ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్‌ సినిమా సెట్స్‌ పైకి వెళ్లనుంది‌. భారీ బడ్జెట్‌తో ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ‘స‌లార్‌’ అనౌన్స్‌మెంట్ రోజు నుండి ప్రేక్ష‌కాభిమానుల్లో ఎగ్జ‌యిట్‌మెంట్‌ను పెంచేస్తుంది. ఈ సినిమాలో మోహన్‌లాల్‌ కనిపించబోతున్నారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దిశాపటానీ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుందని సమాచారం.

    ఈ భారీ పాన్ ఇండియన్ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ పక్కా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నాడట. అంతే కాకుండా పవర్ ఫుల్ బ్యాక్ డ్రాప్ ను కూడా ఎంచుకొన్నాడని తెలుస్తుంది. కొంత సోషల్ కాన్సెప్ట్‌తో సామాన్యుల హక్కుల పోరాడే ఒక పవర్ ఫుల్ అండర్ వరల్డ్ డాన్ పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడట. ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులకు సైతం విపరీతంగా అంచనాలు ఉన్నాయి. కారణం లేకపోలేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ ‌తో ఓ ఖతర్నాక్ దర్శకుడు తోడవ్వడం సినిమా మరింత క్రేజ్‌ను పెంచింది. దేశవ్యాప్తంగా కేజీఎఫ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలియంది కాదు. ఆ సినిమాలో సెంటిమెంట్స్ కానీ, హీరో ఎలివేషన్స్ కానీ, యాక్షన్ సీక్వెన్స్‌లు గానీ.. ఓ రేంజ్‌లో ఉంటాయి. ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో ఓ ప్యాన్ ఇండియా సినిమా అంటే ఓ రేంజ్‌లో ఊహించుకుంటున్నారు.


    ఈ సినిమాను కూడా కేజీఎఫ్ నిర్మాతలే నిర్మించనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ అతి క్రూరుడిగా కనిపించచనున్నాడట. ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఆదిపురుష్ సినిమా చేసే అవకాశం ఉంది. ఈ సినిమాకు బాటీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించనున్నాడు. ఇక ఈ సినిమాలో సీత పాత్రలో కొన్నాళ్లు కీర్తి సురేష్ నటిస్తుందని టాక్ నడిచింది. ఆ తర్వాత ఊర్వశీ రౌటేలా అన్నారు. కాగా తాజా సమాచారం మేరకు మన టాలీవుడ్ లోకి సూపర్ స్టార్ మహేష్ తో ఎంట్రీ ఇచ్చిన టాల్ హీరోయిన్ కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుందని తెలుస్తోంది. ఈమెనే ప్రభాస్ కు సరసన మేకర్స్ ఫిక్స్ చేసినట్టు బాలీవుడ్ వర్గాలలో గట్టిగా వినిపిస్తున్న టాక్. మరి దీనిపై అధికారిక సమాచారం విడుదలకావాల్సి ఉంది.
    Published by:Suresh Rachamalla
    First published: