హోమ్ /వార్తలు /సినిమా /

Salaar: టెన్షన్ పెడుతున్న లీక్స్.. సెట్లో ప్రభాస్ అలా!

Salaar: టెన్షన్ పెడుతున్న లీక్స్.. సెట్లో ప్రభాస్ అలా!

Prabhas Twitter

Prabhas Twitter

Salaar Leaked video: సలార్ సెట్స్ నుంచి లీకైన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. తన అనుచరులతో కలిసి ప్రభాస్ నిలబడి ఉన్న ఓ వీడియో బయటకొచ్చింది. ప్రస్తుతం ఈ షూటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

సినిమా యూనిట్ ఎలాంటి కేర్ తీసుకున్నా సెట్స్ నుంచి వస్తున్న లీక్స్ మేకర్స్ ని టెన్షన్ పెడుతున్నాయి. భారీ బడ్జెట్ కేటాయించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ షూట్ చేస్తున్న సినిమాల నుంచి వీడియోలు బయటకు వస్తుండటం మేకర్స్ ని నిరాశకు గురి చేస్తోంది. తాజాగా ప్రభాస్ (Prabhas) మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్ (Salaar) సెట్స్ నుంచి లీకైన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. తన అనుచరులతో కలిసి ప్రభాస్ నిలబడి ఉన్న ఓ వీడియో బయటకొచ్చింది. ప్రస్తుతం ఈ షూటింగ్ వీడియో (Salaar Leaked video) సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సలార్ సినిమా నుంచి ఇప్పటికే ఎన్నో ఫొటోస్, వీడియోస్ లీక్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి ఈ లీకేజీ వ్యవహారం సలార్ మేకర్స్ కు తలనొప్పిగా మారింది. ప్రెజెంట్ ప్రభాస్ నాలుగైదు భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. అందులో ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీగా రాబోతున్న 'సలార్' మూవీ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ (Action Episodes)తో ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.

కేజీఎఫ్ లాంటి భారీ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులు షేక్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఇప్పుడు ప్రభాస్ సలార్ సినిమాతో ఆ సీన్ మళ్ళీ రిపీట్ చేయాలని ఫిక్సయ్యారట. అంతేకాదు ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ మునుపెన్నడూ చూడనివిధంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. హోంబాలే ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతి బాబు, మలయాళ స్టార్ పృధ్విరాజ్ సుకుమారన్ (Prithwiraj sukumaran), ఈశ్వరీరావు (Eeswari Rao) కీలక పాత్రలు పోషిస్తుండగా.. రవి బస్రూర్ (Ravi Basrur) బాణీలు కడుతున్నారు.

ఈ సినిమాలో ప్రభాస్ ఎంట్రీ సీన్ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారని టాక్. తెలుగు సినిమా చరిత్రలోనే ఎన్నడూ చూడని విధంగా ఈ సీన్ షూట్ చేశారని తెలుస్తోంది. హై టెక్నాలజీ ఉపయోగించి ప్రేక్షకులు మెస్మరైజ్ అయ్యేలా చూపించబోయే కొన్ని సీన్స్ ఈ సినిమాలో హైలైట్ కానున్నాయని సమాచారం. ప్రభాస్ సీక్వెన్స్ కోసం విదేశాలకు చెందిన టెక్నీషియన్లను తీసుకున్నారట. ఈ భారీ సినిమాపై రెబల్ స్టార్ ఫ్యాన్స్ బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు.

Published by:Sunil Boddula
First published:

Tags: Prabhas, Prashanth Neel, Salaar, Salaar movie

ఉత్తమ కథలు