వాటన్నింటినీ మిస్ అవుతున్నాను.. ప్రభాస్ భామ ఆసక్తికర వ్యాఖ్యలు..

అయితే తాను అనుభవిస్తున్న స్టార్‌ ఇమేజ్‌ వలన చాలా కోల్పోయాను అంటోంది శ్రద్ధ . ‘‘సినిమాల్లోకి రాకముందు ఇంటి నుంచి చాలా స్వేచ్ఛగా మార్కెట్‌కు వెళ్లేదాన్ని. ముంబయి కార్టర్‌ రోడ్‌లో హాయిగా తిరిగేదాన్ని. రిక్షాల్లో ప్రయాణం, స్నేహితులతో కలిసి కాఫీ షాప్‌ వెళ్లడం, సేవ్‌ పూరి, వడా పావ్‌....ఇలా ఎన్నో సరదాలు ఉండేవి. అవన్నీ ఇప్పుడు కుదరడం లేదు’’ అని చెప్పింది శ్రద్ధ.sahoo beauty shraddha kapoor sharing her experience after achieving star image

news18-telugu
Updated: October 23, 2019, 1:23 PM IST
వాటన్నింటినీ మిస్ అవుతున్నాను.. ప్రభాస్ భామ ఆసక్తికర వ్యాఖ్యలు..
సాహో చిత్రంలో శ్రద్ధా కపూర్, ప్రభాస్ (Image:Lisaraniray/Instagram)
news18-telugu
Updated: October 23, 2019, 1:23 PM IST
'సాహో’ సినిమాలో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్. ఇక్కడ తొలి సినిమాతోనే ప్రభాస్ వంటి స్టార్ హీరో పక్కన నటించే అవకాశం కొట్టేసింది. హిందీలో కూడా వరుస హిట్లతో దూసుకుపోతుంది.  శ్రద్ధ నటించిన సినిమాలు చూసుకొంటే ఒకదానికికొకటి భిన్నంగా ఉంటాయి. ఓ పక్క మాస్‌మసాలా సినిమాలు చేస్తూనే.. మరో పక్క నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలతోనూ సత్తా చాటుతోంది. ప్రస్తుతం డ్యాన్స్‌ నేపథ్యంగా సాగే ‘స్ట్రీట్‌ డ్యాన్సర్‌ త్రీడీ’లో వరుణ్‌ధావన్‌ సరసన నటిస్తోంది. ఆమె టైగర్‌ ష్రాఫ్‌తో కలిసి నటించిన ‘బాఘీ 3’ పూరిస్తాయి యాక్షన్‌ ఎంటర్టేనర్. ఇంతకు ముందు వీళ్లిద్దరు ‘బాఘీ’ సినిమాలో కలిసి నటించారు. ఇలా డిఫరెంట్‌ జోనర్‌ కథలు ఎంచుకుంటూ వెళ్లడం గురించి శ్రద్ధ మాట్లాడుతూ ‘‘ఓ నటిగా అన్ని రకాల పాత్రలు నటించాల్సిందే. నా అదృష్టం కొద్దీ వైవిధ్యమైన పాత్రలు నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఓ కొత్త పాత్ర చేసే అవకాశం దక్కిందంటే నాకో కొత్త ప్రపంచం దొరికినట్టే’’ అని చెప్పింది.

instagram


అయితే తాను అనుభవిస్తున్న స్టార్‌ ఇమేజ్‌ వలన చాలా కోల్పోయాను అంటోంది శ్రద్ధ . ‘‘సినిమాల్లోకి రాకముందు ఇంటి నుంచి చాలా స్వేచ్ఛగా మార్కెట్‌కు వెళ్లేదాన్ని. ముంబయి కార్టర్‌ రోడ్‌లో హాయిగా తిరిగేదాన్ని. రిక్షాల్లో ప్రయాణం, స్నేహితులతో కలిసి కాఫీ షాప్‌ వెళ్లడం, సేవ్‌ పూరి, వడా పావ్‌....ఇలా ఎన్నో సరదాలు ఉండేవి. అవన్నీ ఇప్పుడు కుదరడం లేదు’’ అని చెప్పింది శ్రద్ధ.

First published: October 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...