Saaho: ప్రభాస్ ‘సాహో’ క్లోజింగ్ కలెక్షన్స్.. ఎంత కలెక్ట్ చేసిందంటే..

రాజమౌళి దర్శత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు. ఆ సినిమా సక్సెస్ తర్వాత ప్రభాస్.. ఒక్క సినిమా అనుభవం ఉన్న సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమా చేసాడు. ఈ సినిమా నాలుగు వారాల్లో ఎంత వసూలు చేసిందంటే..

news18-telugu
Updated: September 26, 2019, 8:17 AM IST
Saaho: ప్రభాస్ ‘సాహో’ క్లోజింగ్ కలెక్షన్స్.. ఎంత కలెక్ట్ చేసిందంటే..
‘సాహో’ మూవీ కలెక్షన్స్
  • Share this:
రాజమౌళి దర్శత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు. ఆ సినిమా సక్సెస్ తర్వాత ప్రభాస్.. ఒక్క సినిమా అనుభవం ఉన్న సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమా చేసాడు. అందరి అంచనాలకు తగ్గట్టే ‘సాహో’ సినిమా  ఫస్ట్ డే అన్ని భాషల్లో అనూహ్యమైన స్పందన వచ్చింది. మొదటి రోజే ఈ సినిమా ఓవరాల్‌గా రూ.138 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా.. ప్రభాస్ స్టార్ ఇమేజ్‌తో ఈ సినిమాకు కలెక్షన్లు మాత్రం అదిరిపోయాయి. ఈ క్రమంలో నాలుగు వారాల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే.. సాహో నాలుగు వారాలకు కలిపి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా నైజాంలో ఈ సినిమా రూ.30 కోట్ల షేర్ రాబట్టింది. సీడెడ్‌లో రూ.12 కోట్ల షేర్..ఉత్తరాంధ్రలో సుమారు రూ.11 కోట్ల షేర్ కలెక్ట్ చేసినట్టు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Saaho movie closing collections and Prabhas movie profits to producers and Losses to distributors pk బాహుబలి 2 సినిమా 2000 కోట్లకు పైగా వసూలు చేస్తే ఔరా అంటూ అంతా నోరెళ్లబెట్టుకున్నారు. ఆ సినిమాతో వచ్చిన ఇమేజ్ ప్రభాస్ సరిగ్గా క్యాష్ చేసుకోడానికి మరోసారి యాక్షన్ ఎంటర్‌టైనర్ చేసాడు. saaho,saaho movie,saaho movie twitter,saaho movie collections,saaho collections,saaho 400 crores,saaho 400 crore collections,prabhas saaho,prabhas saaho collections,telugu cinema,సాహో,ప్రభాస్ సాహో,సాహో కలెక్షన్స్,ప్రభాస్ సాహో కలెక్షన్స్,తెలుగు సినిమా

ఆంధ్రాలో తూర్పు గోదావరి జిల్లాలో రూ.7.5 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.6 కోట్లు, గుంటూరులో రూ.8 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. అలాగే కృష్ణా జిల్లాలో రూ.5.5 కోట్లు, నెల్లూరులో రూ.4.5 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ.84 కోట్ల షేర్ సాధించినట్టు సమాచారం.

Saaho Effect on Bahubali star Prabhas and he is in debts because of huge budget movie pk ప్రభాస్‌కు అప్పులేంటి.. ఆయన ఎంత ఆస్తిపరుడు అనేది ప్రత్యేకంగా చెప్పాలా..? ఒక్క సినిమా తేడా కొడితే అప్పుల్లో పడిపోవడం ఏంటి మరీ పిచ్చి కాకపోతేనూ అనుకుంటున్నారా..? నిజమే అయ్యుండొచ్చు.. saaho,saaho movie,saaho movie collections,prabhas saaho,saaho fake collections,saaho movie prabhas,prabhas debts saaho,telugu cinema,ప్రభాస్,ప్రభాస్ సాహో,సాహో ఫైనల్ కలెక్షన్స్,తెలుగు సినిమా,అప్పుల్లో ప్రభాస్
సాహో దర్శకుడు సుజీత్ (Source: Twitter)




సౌత్‌లో ‘సాహో’ సినిమా విషయానికొస్తే.. కర్ణాటకలో ఈ సినిమా రూ.16.5 కోట్లు కొల్లగొట్టింది. తమిళ వెర్షన్‌లో రూ.5.50 కోట్లు, మలయాళంలో రూ.1.50 కోట్లు సాధించింది. దక్షిణాదిలో ఈ సినిమా రిలీజ్ చేసిన వారికి భారీగా నష్టాలు మిగిల్చింది.

Saaho Effect on Bahubali star Prabhas and he is in debts because of huge budget movie pk ప్రభాస్‌కు అప్పులేంటి.. ఆయన ఎంత ఆస్తిపరుడు అనేది ప్రత్యేకంగా చెప్పాలా..? ఒక్క సినిమా తేడా కొడితే అప్పుల్లో పడిపోవడం ఏంటి మరీ పిచ్చి కాకపోతేనూ అనుకుంటున్నారా..? నిజమే అయ్యుండొచ్చు.. saaho,saaho movie,saaho movie collections,prabhas saaho,saaho fake collections,saaho movie prabhas,prabhas debts saaho,telugu cinema,ప్రభాస్,ప్రభాస్ సాహో,సాహో ఫైనల్ కలెక్షన్స్,తెలుగు సినిమా,అప్పుల్లో ప్రభాస్
సాహో చిత్రంలో దృశ్యం (Image:Lisaraniray/Instagram)


‘సాహో’ చిత్రానికి నార్త్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మొత్తంగా అక్కడ రూ. 157 కోట్లు తెచ్చిపెట్టింది. ఓవర్సీస్ విషయానికొస్తే..అమెరికాలో రూ.14 కోట్లు, మిగతా దేశాల్లోరూ.18 కోట్లు వసూలు చేసి హీరోగా ప్రభాస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది.  ప్రపంచ వ్యాప్తంగా రూ.270 కోట్లకు అమ్మినా ఈ సినిమా మొత్తంగా రూ.220 కోట్ల షేర్ రాబట్టింది. గ్రాస్ మాత్రం రూ.420 కోట్లకు పైగా రాబట్టింది.  మొత్తంగా అన్ని ప్రాంతాలకు కలిసి డిస్ట్రిబ్యూటర్స్‌కు రూ.50 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. తెలుగులో మాత్రం 120 కోట్ల బిజినెస్ చేస్తే.. 80 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. హిందీలో రూ.100 కోట్ల బిజినెస్ చేస్తే.. రూ.150 కోట్లకు వసూళ్లు రాబట్టింది. మొత్తంగా చూసుకుంటే.. సాహో  ఒక్క బాలీవుడ్‌లో మాత్రమే సూపర్ సక్సెస్ అనే చెప్పాలి.
First published: September 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు