news18-telugu
Updated: September 1, 2019, 1:43 PM IST
రూ.200 కోట్ల క్లబ్బులో ప్రభాస్ ‘సాహో’ మూవీ (Twitter/Photo)
‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన సినిమా ‘సాహో’. ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా.. కలెక్షన్లు మాత్రం అదిరిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 42 కోట్లకు పైగా షేర్ రాబట్టిన ‘సాహో’ ఓవర్సీస్లో వన్ మిలియన్ డాలర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా రెండో రోజు కూడా అదే ఊపును కంటిన్యూ చేసింది. మొత్తంగా రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.35కోట్లకు పైగా షేర్ రాబట్టినట్టు సమాచారం. రెండు రోజులకు కలిపి తెలుగు, తమిల వెర్షన్లో రూ. 87 కోట్లు రాబట్టినట్టు సమాచారం. హిందీ వెర్షన్ విషయానికొస్తే.. తొలి రోజే 25 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా రెండో రోజు రూ. 28 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఓవర్సీస్ హిందీ విషయానికొస్తే.. మరో రూ.10 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా రూ 70 కోట్లుకు వసూలు చేసినట్టు బాలీవుడ్ ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు.

‘సాహో’ ఫస్ట్ డే కలెక్షన్స్
మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ‘సాహో’ సినిమా రూ.205 కోట్లు కొల్లగొట్టినట్టు ‘సాహో’ చిత్ర నిర్మాతలు అఫీషియల్‌గా ప్రకకటించారు. ఆల్రెడీ ఆదివారం, సోమవారం వినాయక చవితి కలిపి ఈ సినిమా మరో రెండు వందల కోట్లను ఈజీగా క్రాస్ చేసే అవకాశాలున్నాయి. ఏమైనా తెలుగు హీరో సినిమాకు ఈ స్థాయి వసూళ్లు దక్కడం మాత్రం ఆషామాషీ కాదు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్, నీల్ నితిన్ ముఖేష్,జాకీష్రాఫ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
September 1, 2019, 1:43 PM IST