‘సాహో’ రిజల్డ్‌తో మరోసారి ప్రూవ్ అయిన రాజమౌళి సెంటిమెంట్..

రాజమౌళి,ప్రభాస్ (file photo)

తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ డైరెక్టర్ ఎవరంటే అందరు ఠక్కున చెప్పే పేరు రాజమౌళి. ఆయన  ఏ సినిమా తెరకెక్కించినా.. అదో సంచలనం. కానీ ఆ దర్శకుడితో సినిమాలు చేసిన హీరోలు.. ఆ తరవాత మాత్రం ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమవుతున్నారు. తాజాగా ‘సాహో’ చిత్రం రిజల్ట‌్‌తో అది మరోసారి ప్రూవ్ అయింది.

 • Share this:
  తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ డైరెక్టర్ ఎవరంటే అందరు ఠక్కున చెప్పే పేరు రాజమౌళి. ఆయన  ఏ సినిమా తెరకెక్కించినా.. అదో సంచలనం. కానీ ఆ దర్శకుడితో సినిమాలు చేసిన హీరోలు.. ఆ తరవాత మాత్రం ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమవుతున్నారు. తాజాగా ‘సాహో’ చిత్రం రిజల్ట‌్‌తో అది మరోసారి ప్రూవ్ అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. తొలి రెండు రోజుల్లో రూ.200 కోట్లు రాబట్టినఈ సినిమా ముందు ముందు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేయబోతుందో పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. కథ లేకుండా కేవలం టేకింగ్‌తో ఈ సినిమాను లాక్కొచ్చే ప్రయత్నం చేసారు. ‘బాహుబలి’ సినిమా తర్వాత హీరోగా ప్రభాస్ క్రేజ్ ఆకాశమే హద్దుగా సాగింది. దాంతో ఆ అంచనాలు అందుకోవడంతో ‘సాహో’ చిత్రం ఫెయిల్ అయింది. గతంలో రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘ఛత్రపతి’ తర్వాత ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ‘పౌర్ణమి’ కూడా ఈ రకంగానే ఫ్లాప్ టాక్ మూట గట్టుకుంది.

  ’బాహుబలి’ లో ప్రభాస్ అనుష్క


  ఒక్క ప్రభాస్ విషయంలోనే కాదు.. ఎన్టీఆర్ కూడా రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘సింహాద్రి’ తర్వాత స్టార్ హీరో అయ్యాడు. ఈ సినిమా తర్వాత చేసిన ‘ఆంధ్రవాలా’ కూడా అంచనాలు అందుకోలేక చతికిలబడింది. అటు ‘యమదొంగ’ తర్వాత ‘కంత్రి’తో ఆ మ్యాజిక్‌ను అందుకోలేకపోయాడు.

  యమదొంగ (ఫేస్‌బుక్ ఫోటో)


  ఇక రామ్ చరణ్ కూడా రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘మగధీర’తో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసాడు. కానీ ఆ  తర్వాత ‘ఆరెంజ్’తో ఆ అంచనాలను అందుకోలేకపోయాడు.

  10 Years Completed for Ram Charan Magadheera movie which directed by Sensational director SS Rajamouli pk అప్పటి వరకు తెలుగు సినిమా మార్కెట్ అంటే 40 కోట్లే.. పోకిరి సినిమా వచ్చి 40 కోట్లు వసూలు చేస్తే అదో అద్భుతంలా చూసారంతా. కానీ అప్పుడే వచ్చింది ఓ అద్భుతం. #Magadheera,magadheera,magadheera twitter,magadheera facebook,#10YearsOfMagadheera,magadheera 10 years,magadheera 10 years completed,ram charan magadheera 10 years,#10yearsforMagadheera,#DecadeOfIHMagadheera,#MomentsOfMagadheera,rajamouli magadheera 10 years,rajamouli ram charan,magadheera collections,dacade for magadheera,magadheera industry hit,magadheera full collections,ram charan kajal agarwal,magadheera visual wonder,telugu cinema,మగధీర,మగధీర కలెక్షన్స్,మగధీర 10 ఇయర్స్,రాజమౌళి మగధీర,రామ్ చరణ్ మగధీర,తెలుగు సినిమా
  మగధీర చిత్రానికి 10 ఏళ్ళు పూర్తి (Source: Twitter)


  అటు రవితేజ కూడా జక్కన్న దర్శకత్వంలో చేసిన ‘విక్రమార్కుడు’ తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన ‘ఖతర్నాక్’ సినిమాతో మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు.

  విక్రమార్కుడు (ఫేస్‌బుక్ ఫోటో)


  నాని కూడా  రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘ఈగ’ తర్వాత చేసిన ‘ఎటోవెళ్లిపోయింది మనసు’ సినిమాతో సేమ్ పరిస్థితిని ఎదుర్కొన్నాడు.

  ఈగ (ఫేస్‌బుక్ ఫోటో)


  అటు కమెడియన్ నుంచి హీరో అయిన సునీల్ కూడా రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘మర్యాద రామన్న’ తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో చేసిన ‘కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు’తో విజయాన్ని అందుకోలేకపోయాడు.

  మర్యాద రామన్న(ఫేస్‌బుక్ ఫోటో)


  అటు నితిన్ కూడా రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘సై’ తర్వాత చేసిన ‘అల్లరి బుల్లోడు’తో హిట్టు కొట్టలేకపోతాడు. ఇక రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఎన్టీఆర్,రామ్ చరణ్‌లతో తెరకెక్కిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత వీళ్లిద్దరు మరోసారి ఆ స్థాయి విజయాన్ని అందుకుంటారా లేదా అనేది చూడాలి.
  First published: