Saaho : ప్రభాస్ సాహోపై పబ్లిక్ టాక్ ఏంటి..?

Saaho Public Talk : సోషల్ మీడియాలో సినిమాకు డివైడ్ టాక్ వినిపిస్తోంది. బాగుంది అనేవారు కొందరైతే.. బాగా ఉందంటూనే అంచనాలను అందుకోలేదని చెబుతున్నవారు మరికొందరు. అయితే ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్స్ మాత్రం ఇలాంటి రివ్యూలను నమ్మవద్దని.. సినిమా చాలా బాగుందని చెబుతున్నారు.

news18-telugu
Updated: August 30, 2019, 10:37 AM IST
Saaho : ప్రభాస్ సాహోపై పబ్లిక్ టాక్ ఏంటి..?
ఐమాక్స్ వద్ద ప్రేక్షకులు
news18-telugu
Updated: August 30, 2019, 10:37 AM IST
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తిపంపు తెచ్చుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ నేడు సాహోతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రెండేళ్లుగా చిత్రీకరణ జరుపుకున్న చిత్రం కావడంతో.. అభిమానులు భారీ అంచనాలతో థియేటర్స్ వద్దకు వెళ్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఆయా థియేటర్స్‌లో షోలు ప్రదర్శిస్తుండటంతో.. అభిమానుల హడావుడి తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో సాహో సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతీ ఒక్కరిలో పెరిగిపోయింది. సినిమా విడుదల కావడమే ఆలస్యం.. యూట్యూబ్,సోషల్ మీడియాల్లో సినిమా రివ్యూల కోసం వెతికేస్తున్నారు. మరి సాహోపై సగటు అభిమాని ఏమంటున్నాడు..? ప్రభాస్ అభిమానులు సినిమాపై పాజిటివ్‌గా స్పందిస్తున్నా.. నెగటివ్ టాక్ కూడా అంతే స్థాయిలో వినిపిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో సినిమాకు డివైడ్ టాక్ వినిపిస్తోంది. బాగుంది అనేవారు కొందరైతే.. బాగా ఉందంటూనే అంచనాలను అందుకోలేదని చెబుతున్నవారు మరికొందరు. అయితే ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్స్ మాత్రం ఇలాంటి రివ్యూలను నమ్మవద్దని.. సినిమా చాలా బాగుందని చెబుతున్నారు.

ఏదేమైనా మరికొద్ది గంటలు వేచి చూస్తే.. సినిమాపై అసలు టాక్ బయటకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాహోతో ప్రభాస్ అభిమానులను మరోసారి మెస్మరైజ్ చేశాడా..? లేక కొంతమంది చెబుతున్నట్టుగా అంచనాలను అందుకోలేకపోయాడా..? అన్నది వేచి చూడాలి.

First published: August 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...