news18-telugu
Updated: September 4, 2019, 11:27 AM IST
‘సాహో’ పోస్టర్ Photo ; Twitter
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ సినిమాతో హీరోగా ప్రభాస్ క్రేజ్ దేశ వ్యాప్తంగా పెరిగింది. దీంతో ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అనుకున్నట్టుగానే ఈ సినిమాకు ఫస్ట్ డే అన్ని భాషల్లో అనూహ్యమైన స్పందన వచ్చింది. మొదటి రోజే ఈ సినిమా ఓవరాల్‌గా రూ.138 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. మొత్తంగా నాలుగు రోజులకు కలపి రూ.350 కోట్ల వరకు కొల్లగొట్టింది. సోమవారం వినాయక చవితి సెలవు ఉండటంతో ఈ సినిమాకు కలెక్షన్స్ బాగానే వచ్చాయి. కానీ మంగళవారం మాత్రం ‘సాహో’ సినిమాకు అన్ని ఏరియాల్లో భారీ కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో 5వ రోజు కేవలం 4లక్షల 63వేల 8వందల 96 రూపాయలు గ్రాస్‌ను కలెక్ట్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు అక్కడ 6 థియేటర్స్‌లో కూడా సాహో సినిమా విడుదలైతే.. ఇపుడు మాత్రం మూడు థియేటర్స్‌కే పరిమితమైంది.

రూ.200 కోట్ల క్లబ్బులో ప్రభాస్ ‘సాహో’ మూవీ (Twitter/Photo)
నైజాంలో ‘సాహో’ మంగళవారం రూ.కోటి షేర్‌తో 5 రోజుల్లో రూ.24 కోట్ల షేర్‌ను రాబట్టి బాహుబలి 1, 2 తర్వాత ప్లేస్‌లో నిలిచింది. ఒక తమిళ, మలయాల వెర్షన్లో ఈ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకోగా.. ఓవర్సీస్లో పెద్దగా మెరుపులు మెరిపించలేకపోయింది.

సాహో కలెక్షన్స్ (Source: Twitter)
ఇక నైజాం లో సాహో, మంగళవారం కోటి రూపాయల షేర్ తో 5రోజుల్లో 24కోట్ల షేర్ ను రాబట్టి బాహుబలి 1&2 తరువాత అల్ టైం గ్రాసర్ గా రికార్డు సృష్టించింది. ఇక తమిళ , మలయాళ వెర్షన్ లు డిజాస్టర్ ఫలితాన్ని చవి చూడగా ఓవర్సీస్ లో కూడా అదే ఫలితాన్ని కొనసాగించింది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టేనర్‌గా తెరకెక్కింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ నటించింది.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
September 4, 2019, 11:27 AM IST